Ponniyin Selvan 1: అదిరిపోయిన రాజ రాజ చోళగా జయం రవి ఫస్ట్ లుక్.. టీజర్ విడుదలకి రంగం సిద్ధం

ABN , First Publish Date - 2022-07-08T20:18:45+05:30 IST

తమిళ స్టార్ డైరెక్టర్‌ మణిరత్నం (Maniratnam) ‘పొన్నియన్‌ సెల్వన్‌’ అనే ఇండియా మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే...

Ponniyin Selvan 1: అదిరిపోయిన రాజ రాజ చోళగా జయం రవి ఫస్ట్ లుక్.. టీజర్ విడుదలకి రంగం సిద్ధం

తమిళ స్టార్ డైరెక్టర్‌ మణిరత్నం (Maniratnam) ‘పొన్నియన్‌ సెల్వన్‌’ అనే ఇండియా మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీలో విక్రమ్ (Vikram), కార్తీ (Karthi), త్రిష (Trisha), ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai), జయం రవి (Jayam Ravi), జయరాం (Jayaram), ప్రకాష్ రాజ్ (Prakash Raj), ప్రభు (Prabhu), శరత్ కుమార్, పార్తీబన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్ 30న విడుదలకానున్న ఈ మూవీ మొదటి భాగం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ తరుణంలోనే కీలకపాత్రల ఫస్ట్ లుక్‌లను ఈ చిత్రబృందం వరుసగా విడుదల చేస్తోంది.


విక్రమ్‌, ఐశ్వర్య రాయ్‌, కార్తీ, త్రిష ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు ఇప్పటికే విడుదలై సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. తాజాగా రాజ రాజ చోళగా నటించిన జయం రవి ఫస్ట్ లుక్‌ సైతం తాజాగా (శుక్రవారం) విడుదలైంది. అందులో.. ఓ చేతిలో బల్లెం, మరో చేతిలో డాలు పట్టుకుని యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. తాజా పోస్టర్‌కి సైతం అభిమానుల నుంచి, ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. మద్రాస్ టాకీస్ రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌కి.. ‘విజనరీ ప్రిన్స్, స్వర్ణయుగ రూపశిల్పి, గ్రేట్ రాజ రాజ చోళుడుకి జై... పొన్నియన్ సెల్వన్‌ని పరిచయం చేస్తున్నాం’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. అలాగే.. ఈ మూవీ టీజర్‌ని సాయంత్రం 6 గంటలకి విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీంతో ఎంతో ఆతృతగా ఈ సినిమా టీజర్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.


అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అన్ని భాషల ఆడియో హక్కులను రికార్డ్ ధరకు ప్రముఖ ఆడియో సంస్థ టిప్స్ మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారట. కోలీవుడ్ సినీ వర్గాల ప్రకారం ఈ చిత్రానికి 24 కోట్లు భారీ మొత్తంలో టిప్స్ మ్యూజిక్ వారు చెల్లించారట. ఇది సౌత్ ఇండియన్ సినిమా దగ్గర రికార్డు మొత్తంలో ఒకటని అంటున్నారు.



Updated Date - 2022-07-08T20:18:45+05:30 IST