James Twitter Review: పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం ఎలా ఉందంటే..
ABN , First Publish Date - 2022-03-17T19:23:39+05:30 IST
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గతేడాది అక్టోబర్‌లో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే...

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గతేడాది అక్టోబర్‌లో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం కన్నడతో పాటు ఇతర సినీ పరిశ్రమల్లోని అభిమానులను, సెలబ్రిటీలను షాక్‌కి గురి చేసింది. కాగా.. చేతన్ కుమార్ దర్శకత్వంలో పునీత్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. ఈ మూవీ ఆయన జయంతి సందర్భంగా మార్చి 17న విడుదలైంది. పునీత్ అభిమానులకు ఎంతో ప్రత్యేకమైన ఈ సినిమా ట్విటర్ రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం..
పునీత్ కెరీర్‌లోనే అత్యధికంగా 4వేల స్క్రీన్స్‌లో ఈ చిత్రం విడుదలైంది. ఆయన్ని చివరి సారి వెండితెరపైన చూసిన అభిమానులు ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. ఎంతోమంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సైతం ఈ సినిమా గురించి పంచుకుంటూ ఆయన అభిమానాన్ని తెలియజేస్తున్నారు. ఆయన నటన, డైలాగ్ డెలివరీ, అన్ స్ర్కీన్ ప్రజెన్స్, డ్యాన్స్ సూపర్ అంటూ ట్వీట్స్ పెడుతున్నారు. అలాగే ఆయన ఇద్దరు అన్నయ్యలు శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్ క్యామియో రోల్స్‌లో చేయడం ఈ మూవీకి చాలా ఉపయోగపడిందట. బెనిఫిట్ షో నుంచే హిట్ టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద.. ఇది పునీత్ రాజ్‌కుమార్ షో అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సినిమాకి రివ్యూ కూడా అవసరం లేదని, కేవలం అప్పు కోసమే చూడొచ్చంటున్నారు. అయితే పునీత్ మరణించే సమయానికి డబ్బింగ్ పూర్తి కాలేదు. దీంతో కొన్ని సన్నివేశాల్లో ఆయనకి శివ రాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పారు.
ఈ సినిమా మొదటి అర్థభాగమైతే ఫుల్ యాక్షన్‌తో పవర్ ప్యాక్డ్‌గా ఉందంట. ప్రతి సీన్‌కి విజిల్స్ వేస్తూ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉందంట. అలాగే కన్నడ పవర్ స్టార్ నిజమైన నివాళి ఈ చిత్రమంటూ ట్వీట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో పునీత్ సరసన ప్రియా ఆనంద్ కథానాయికగా నటించగా.. తెలుగు నటుడు శ్రీకాంత్ విలన్‌గా చేశారు. శరత్ కుమార్, ముఖేష్ రిషి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
Read more