బీరు తాగిన మత్తులో... చావు నోట్లో దాకా వెళ్లి వచ్చిన చాన్!

ABN , First Publish Date - 2022-04-09T04:38:03+05:30 IST

తన బీరు స్టంట్ అలా వికటించటంతో జాకీ తల పగిలిపోయిందట. చావు నోట్లో దాకా చాన్ వెళ్లి వచ్చాడట. మూడున్నద దశాబ్దాల కిందట ముప్పుని మార్షల్ ఆర్ట్స్ సూపర్ స్టార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో జ్ఞాపకం చేసుకున్నాడు...

బీరు తాగిన మత్తులో... చావు నోట్లో దాకా వెళ్లి వచ్చిన చాన్!

వినటానికే ఒళ్లు గగుర్పొడిచే విషయం ఒకటి జాకీ చాన్ తాజాగా బయట పెట్టాడు. ‘ఆర్మర్ ఆఫ్ గాడ్’ పేరుతో ఆయన 1986లో చేసిన యాక్షన్ థ్రిల్లర్ అప్పట్లో ప్రాణాలకు మీదకు తెచ్చిందట. ఆ సినిమా షూటింగ్ సమయంలో తాను తల పగులగొట్టుకుని... దాదాపుగా చచ్చిపోయానని జాకీ అంటున్నాడు! 


1986లో... ఇంతకీ ఏమైందంటే... జాకీ చాన్ ‘ఆర్మర్ ఆఫ్ గాడ్’ సినిమా కోసం ఓ చెట్టు మీదకి దూకాలట. అయితే, పై నుంచీ చెట్టు మీదకి దూకే ముందు కథలో భాగంగా బీర్ క్యాన్ నుంచీ మత్తు పానీయం సేవించాలట! మొదటి సారి బీర్ తాగి చెట్టు మీదకి దూకేశాడు. కానీ, టేక్ ఓకే కాలేదు. రెండోసారి బీరు తాగిన మత్తులోనే మళ్లీ చెట్టు మీదకి పై నుంచీ దూకాడట! ఇంకేముంది... కళ్లు గిర్రున తిరిగిపోయాయి... ఏమవుతుందో అర్థం అయ్యేలోగానే చెట్టు కొమ్మలు అడ్డంగా, నిలువుగా తాకేశాయి! జాకీ చాన్ నేల మీద పడ్డాడు... 


తన బీరు స్టంట్ అలా వికటించటంతో జాకీ తల పగిలిపోయిందట. చావు నోట్లో దాకా చాన్ వెళ్లి వచ్చాడట. మూడున్నద దశాబ్దాల కిందట ముప్పుని మార్షల్ ఆర్ట్స్ సూపర్ స్టార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో జ్ఞాపకం చేసుకున్నాడు...  

Updated Date - 2022-04-09T04:38:03+05:30 IST