సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ishwaya : తండ్రి తలైవాతో అదిరిపోయే కార్ఫీ..

ABN, First Publish Date - 2022-07-29T16:27:30+05:30

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth) గత చిత్రం ‘పెద్దన్న’ (Peddanna) ఆశించిన రీతిలో మ్యాజిక్ చేయలేకపోయింది. అందుకే తదుపరి చిత్రంతో అభిమానులకు ఓ సూపర్ హిట్ ఇవ్వాలనే తలంపుతో ఉన్నారు రజనీ.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth) గత చిత్రం ‘పెద్దన్న’ (Peddanna) ఆశించిన రీతిలో మ్యాజిక్ చేయలేకపోయింది. అందుకే తదుపరి చిత్రంతో అభిమానులకు ఓ సూపర్ హిట్ ఇవ్వాలనే తలంపుతో ఉన్నారు రజనీ. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఆయన 169వ చిత్రం ‘జైలర్’ (Jailer) మళ్ళీ తనను తిరిగి సూపర్ ఫామ్ లోకి తీసుకొస్తుందనే నమ్మకంతో ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇక అసలు విషయానికొస్తే.. తనకి ఎంతో ఇష్టమైన గేమ్ చెస్ అని ఇటీవల చెబుతూ.. తను చెస్ ఆడుతున్న పిక్ ఒకటి షేర్ చేశారు రజనీకాంత్. ప్రస్తుతం చెన్నైలో 44వ చెస్ ఒలింపియాడ్ జరుగుతుండడంతో రజనీకి చెస్ గురించి గుర్తుకొచ్చి ఆ ఫోటోను షేర్ చేశారు. 


ఇప్పుడు జరుగుతున్న చెస్ ఒలింపియాడ్ ఓపెనింగ్ కు రజనీకాంత్ కూడా వెళుతున్నారు. ఆయనతో తనయ ఐశ్వర్య (Ishwarya) కూడా పయనమైంది. ఈ సందర్భంగా ఐశ్వర్య తండ్రి రజినీకాంత్ తో కూల్‌గా కార్‌లో ఒక సెల్ఫీ లాగించేసింది. ఈ పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ. కార్ లో దిగిన సెల్ఫీ కాబట్టి దీనికి కార్ఫీ అని పేరు పెట్టింది. నేటి నుంచి ఆగస్ట్ 10 వరకూ మామల్లాపురంలో ఈ ఒలింపియాడ్ జరగనుంది. దానికి రజనీకాంత్ హాజరవడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.  ప్రస్తుతం ఐశ్వర్యా పోస్ట్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 



Updated Date - 2022-07-29T16:27:30+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!