సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Samantha: దుల్కర్ సల్మాన్‌కు జోడీగా సమంత నటించనుందా..?

ABN, First Publish Date - 2022-08-05T21:31:32+05:30

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న నటి సమంత (Samantha). తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి తానేంటో నిరూపించుకుంది. హిందీలోను ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న నటి సమంత (Samantha). తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి తానేంటో నిరూపించుకుంది. హిందీలోను ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులకు చేరువైంది. హాలీవుడ్‌లోను ‘అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్’ చిత్రాన్ని ఒకే చేసింది. సామ్ త్వరలోనే మలమాళం ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan)కు జోడీగా నటించనుందని మీడియాలో పుకార్లు షికార్లు కొడుతున్నాయి.  


దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కింగ్ ఆఫ్ కోతా’ (King of Kotha). గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కనుంది. అభిలాష్ జోషి (Abhilash Joshiy) దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాతోనే సమంత మలయాళం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. ఈ మూవీలోనే దుల్కర్‌తో ఆమె రొమాన్స్ చేయనుందని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. మేకర్స్ ఇప్పటికే ఆమెను సంప్రదించారని సమాచారం. మరి ఈ వార్తలు నిజమో, కాదో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే. గతంలో సమంత, దుల్కర్ ‘మహానటి’ (Mahanati)లో నటించారు. కానీ, ఈ చిత్రంలో వీరిద్దరికి కాంబినేషన్ సీన్స్ లేవు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. సమంత చివరగా ‘కాతు వక్కుల రెండు కాదల్’ (Kaathuvaakula Rendu Kaadhal) లో నటించింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతార కీలక పాత్రలు పోషించారు. విజయ్ దేవర‌కొండతో ‘ఖుషీ’ అనే చిత్రం కూడా ఆమె చేస్తుంది. ‘యశోద’, ‘శాకుంతలం’ సినిమాల షూటింగ్‌లను ఇప్పటికే ముగించింది. ఈ మూవీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.  

Updated Date - 2022-08-05T21:31:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!