సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

స్టార్ హీరోయిన్‌తో డేటింగ్ చేస్తోన్న చియాన్ విక్రమ్ కొడుకు..?

ABN, First Publish Date - 2022-01-03T00:07:19+05:30

విభిన్న రకాల పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు చియాన్ విక్రమ్. అపరిచితుడు, ఐ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విభిన్న రకాల పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు చియాన్ విక్రమ్. అపరిచితుడు, ఐ వంటి చిత్రాల్లో  నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్ కూడా సినిమాల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ హిట్ చిత్రం ‘‘ అర్జున్ రెడ్డి ’’ ని  ‘‘ ఆదిత్య వర్మ ’’ పేరుతో  ధ్రువ్ కోలీవుడ్‌లో రీమేక్ చేశారు. ఈ సినిమాలో అతడి సరసన బనితా సంధు హీరోయిన్‌గా నటించింది. ఆ సమయంలోనే వీరిద్దరూ స్నేహితులుగా మారారని తెలుస్తోంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారిందని కోలీవుడ్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం వారిద్దరూ డేటింగ్ చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. 


ధ్రువ్ , బనితా సంధు కొత్త ఏడాది సంబరాలను దుబాయ్‌లో  జరుపుకొన్నారు. హోటల్ రూంలో బనితా సంధు ఉన్న 2 వీడియోస్‌ని ఇన్‌స్టాగ్రాం స్టోరీస్‌లో ధ్రువ్ షేర్ చేశారు. మొదట బుర్జ్ ఖలీఫాని బనితా సంధు చూస్తున్న వీడియోని పంచుకున్నారు. ఈ జంట  2022కు స్వాగతం పలుకుతున్న దృశ్యాలను రెండో వీడియోగా షేర్ చేశారు. వీడియోలను పోస్ట్ చేయగానే నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఈ జంట డేటింగ్ చేస్తుందని సోషల్ మీడియా యూజర్స్ కోడై కూస్తున్నారు.



Updated Date - 2022-01-03T00:07:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!