పుతిన్‌కు హాలీవుడ్ డైరెక్టర్ ఇచ్చిన సలహా ఇదే..
ABN, First Publish Date - 2022-02-26T21:55:14+05:30
రష్యా భద్రతా దళాలు ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్నసంగతి
రష్యా భద్రతా దళాలు ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంతో ఉక్రెయిన్‌లో భయానక పరిస్థితులు నెలకొని, జనజీవనం అతలాకుతలమైంది. ఈ ఘటనపై అనేక మంది సెలబ్రెటీలు స్పందించారు. తాజాగా హాలీవుడ్ డైరెక్టర్ డేవిడ్ లించ్ కూడా ఈ దాడిని ఖండించారు. ఆయన యూట్యూబ్‌లో ఓ వీడియోను విడుదల చేశారు. పదునైన భాషను వాడుతూ పుతిన్‌పై విరుచుకుపడ్డారు.
ఉక్రెయిన్ ప్రజలతో పుతిన్ అమానుషంగా ప్రవర్తిసున్నారని మండిపడ్డారు. పుతిన్‌కు త్వరలోనే మరణం సంభవిస్తుందన్నారు. ‘‘మనం మనుషులం కాబట్టి తోటివారిని ఇబ్బందులకు గురి చేయకూడదు. అదే ప్రకృతి నియమం. ఇందులో ఎటువంటి లొసుగులు లేవు. దీని నుంచి ఎవరూ కుడా తప్పించుకోలేరు. కానీ, ఉక్రెయిన్‌లో ప్రజలను చంపావు కాబట్టి తప్పకుండా నువ్వు కూడా మరణిస్తావు. రష్యాపై ఉక్రెయిన్ దాడికి పాల్పడలేదు. ఉక్రెయిన్ పైనే రష్యా దాడి చేసింది. పర్యవసానంగా నీకు తప్పకుండా మరణం సంభవిస్తుంది’’ అని డేవిడ్ లించ్ చెప్పారు.
హాలీవుడ్ డైరెక్టర్ డేవిడ్ లించ్ రష్యా అధ్యక్షుడికి సలహా కూడా ఇచ్చారు. ‘‘నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే ముందుగా ఉక్రెయిన్‌పై దాడిని ఆపాలి. ఆ దేశాన్ని కాపాడాలి. తోటివారితో స్నేహం చేయడం నేర్చుకోండి. ప్రపంచమంతా ఒకే కుటుంబం అనడంతో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముందుగా ఉక్రెయిన్‌పై దాడిని ఆపాలి. అన్నిదేశాలు కలసి చర్చించుకొని శాంతిస్థాపనకు కృషిచేయాలి. ప్రపంచం ఎదుర్కొంటున్న ఇబ్బందులను సామరస్యంగా పరిష్కరించుకోవాలి’’ అని డేవిడ్ పేర్కొన్నారు. ‘ట్విన్ పిక్స్: ది రిటర్న్’ టీవీ సిరీస్‌కు డేవిడ్ దర్శకత్వం వహించారు.