సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

హృతిక్ రోషన్‌ చాలా అందంగా ఉంటాడు : హాలీవుడ్ నటి సమంత

ABN, First Publish Date - 2022-01-20T16:19:49+05:30

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆయన నటనకే కాకుండా అందానికి సైతం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సాధారణ ప్రజలే కాకుండా సెలబ్రిటీలు సైతం ఆయనకు ఫిదా అవుతుంటారు. తాజాగా హాలీవుడ్ నటి సమంత లాక్‌వుడ్ ఈ గ్రీకు వీరుడిపై ప్రశంసలు కురిపించింది.


ఓ ఇంటర్య్వూలో సమంత మాట్లాడుతూ.. ‘హృతిక్‌ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆయనచాలా మంచి వ్యక్తి. అంతేకాకుండా ప్రపంచంలో నాకు ఇష్టమైన ప్రదేశాలలో ఒకటైన హవాయి గురించి ఆయనతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. నేను చిన్నప్పటి నుంచే అక్కడికి వెళ్తుంటాను. నాకు దాదాపు నాలుగు సంవత్సరాలుగా అక్కడ యోగా స్టూడియో ఉంది. నేను ఆ ప్రదేశాన్ని ప్రేమిస్తున్నాను. దీంతో ఇద్దరం దాని గురించి మాట్లాడుకున్నాం. సినిమాల గురించి మాట్లాడుకున్నాం. నిజానికి ఆయన చాలా అందమైన వ్యక్తి. చూసే కొద్ది చూడాలనిపిస్తుంద’ని చెప్పుకొచ్చింది.


అంతేకాకుండా ఆయనలో తనకు నచ్చిన విషయాల గురించి కూడా మాట్లాడింది సమంత. ‘ఆయన తన శరీరాన్ని మంచి షేపులో ఉంచుకుంటాడు. చాలా స్వీట్. ఆయన చాలా ఫ్యామిలీకి బద్ధుడై ఉండే వ్యక్తి. అందుకే ఎప్పుడూ తన పిల్లల గురించి చాలా మాట్లాడుతుంటాడు. ఆయనకి కష్టపడడం చాలా ఇష్టం. అందుకే ఎప్పుడూ ఏదో షూటింగ్‌లో ఉంటాడు. ఇది మరొక గొప్ప గుణమం’టూ తెలిపింది.


అయితే గత నెలలో సల్మాన్ బర్త్ డేకి అటెండ్ అయ్యింది సమంత. అదే సమయంలో హృతిక్‌ని కూడా కలిసింది. కానీ సల్మాన్‌తో ఈ బ్యూటీ రిలేషన్‌షిప్‌లో ఉందని అందుకే ఆయన పుట్టిన రోజుకి వచ్చిందని పుకార్లు షికార్లు చేయగా.. అదేం లేదని కొట్టిపారేసింది ఈ బ్యూటీ.



Updated Date - 2022-01-20T16:19:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!