సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బెడిసికొట్టిన యువనటి సర్జరీ.. గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ముఖం..

ABN, First Publish Date - 2022-06-21T01:24:16+05:30

సినిమా అనేది రంగుల ప్రపంచం. అందులోకి వెళ్లాలని ప్రతి ఒక్కరు ఆశపడుతుంటారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. నటన రావడంతో పాటు అందంగా ఉంటెనే సినిమా అవకాశాలు వస్తాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినిమా అనేది రంగుల ప్రపంచం. అందులోకి వెళ్లాలని ప్రతి ఒక్కరు ఆశపడుతుంటారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. నటన రావడంతో పాటు అందంగా ఉంటెనే సినిమా అవకాశాలు వస్తాయి. అందువల్లే హీరోయిన్స్ గ్లామర్‌గా కనిపించడానికి ప్రాధాన్యమిస్తుంటారు. అందుకోసం నటీ, నటులు సర్జరీలు చేయించుకుంటుంటారు. గతంలో చాలా మంది శస్త్రచికిత్సలు చేయించుకున్న ఉదంతలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ నటి అవకాశాల కోసం సర్జరీ చేయించుకోగా అది బెడిసికొట్టింది. తాజాగా ఈ ఘటన బయటికి వచ్చింది. 


‘ఎఫ్‌ఐఆర్’ (FIR), ‘6 టు 6’ (6 to 6) వంటి సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ స్వాతి సతిష్ (Swathi Sathish). రూట్ కెనాల్ సర్జరీ నిమిత్తం బెంగళూరులోని ఒరిక్స్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స చేయించుకున్నారు. సర్జరీ అనంతరం ఆమె ముఖం వాచిపోయింది. ఎవరు గుర్తపట్టలేనంతగా మారిపోయింది. ఫలితంగా ఒరిక్స్ ఆస్పత్రిలోని వైద్యులను సంప్రదించగా సైడ్ ఎఫెక్ట్ వల్ల ఈ విధంగా జరింగిందని చెప్పారు. కొన్ని గంటల్లోనే తగ్గిపోతుందని పేర్కొన్నారు. మూడు వారాలైనప్పటికీ ఆ వాపు తగ్గిపోలేదు. దీంతో మరో ఆస్పత్రికి ఆమె వెళ్లారు. అక్కడికి వెళ్లితే ఆమెకు షాకింగ్ న్యూస్ ఎదురయింది. సర్జరీలో భాగంగా ఒరిక్స్ డాక్టర్స్ అనస్థీషియాకు బదులు సాలిసిలిక్‌ యాసిడ్‌ ఇచ్చార‌ని ఆమెకు తెలిసింది. దీంతో ఒరిక్స్ ఆస్పత్రిపై కేసు వేయాలని నిర్ణయించుకున్నారు. చికిత్స నుంచి కోలుకున్నాక ఆ పని చేయనున్నట్టు స్పష్టం చేశారు. గతంలో చేతన్ రాజ్ (Chethana Raj) అనే నటి బరువు తగ్గించుకునేందకు సర్జరీ చేయించుకోగా ఆమె కన్ను మూసిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2022-06-21T01:24:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!