సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘జల్లికట్టు’ బరిలోకి దిగుతోన్న హీరోయిన్‌ షీలా.. ఫొటో వైరల్

ABN, First Publish Date - 2022-02-02T01:56:43+05:30

తమిళ సంప్రదాయ సాహస క్రీడ జల్లికట్టు పోటీల్లో పాల్గొని తమ వీరత్వాన్ని ప్రదర్శించేందుకు అనేక మంది యువత పోటీ పడుతుంటారు. ఈ క్రీడా పోటీలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీగా ప్రజలు తరలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళ సంప్రదాయ సాహస క్రీడ జల్లికట్టు పోటీల్లో పాల్గొని తమ వీరత్వాన్ని ప్రదర్శించేందుకు అనేక మంది యువత పోటీ పడుతుంటారు. ఈ క్రీడా పోటీలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీగా ప్రజలు తరలి వస్తుంటారు. తాజాగా, హీరోయిన్‌ షీలా రాజ్‌కుమార్‌ ఈ జల్లికట్టు పోటీల బరిలోకి దిగారు. ఈ పోటీల్లో పాల్గొనే ఎద్దుతో కలిసి బరిలో నడిచి వెళ్తున్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. 


‘ఆహా’ ఓటీటీ కోసం జల్లికట్టు పోటీలతో ఓ వెబ్‌సిరీ‌స్‌ను రూపొందిస్తున్నారు. ఇందుకోసం షీలా రాజ్‌ కుమార్‌ నిజంగానే జల్లికట్టు బరిలోకి దిగింది. ప్రముఖ దర్శకుడు వెట్రి మారన్‌ వద్ద పనిచేసిన రాజ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌ పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. కాగా, షీలా గత యేడాది హాస్య నటుడు యోగిబాబు నటించిన ‘మండేలా’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.  

Updated Date - 2022-02-02T01:56:43+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!