హాలీవుడ పాటకు భాంగ్రా స్లైల్లో స్టెప్పులేసిన పెళ్లి కూతురు
ABN, First Publish Date - 2022-01-24T01:59:01+05:30
పాశ్చాత్య సంగీతాభిమానులకు ఎడ్ షీరన్ సుపరిచితమే. అతడి పాట ‘షేప్ ఆఫ్ యూ’కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు
పాశ్చాత్య సంగీతాభిమానులకు ఎడ్ షీరన్ సుపరిచితమే. అతడి పాట ‘షేప్ ఆఫ్ యూ’కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆ పాటకు ఒక పెళ్లి కూతురు స్టెప్పులేసింది. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా విపరీతంగా ఆ వీడియోను షేర్ చేస్తున్నారు.
ఆ వీడియోలో.. పెళ్లి కూతురితో పాటు మరికొందరు స్టెప్పులేస్తున్నారు. ఆమె పెళ్లి రోజు అందరు నవ్వుతూ పర్ఫామెన్స్ ఇస్తున్నారు. ఎడ్ షీరన్ పాటకు ప్రతి ఒక్కరు భాంగ్రా స్టైల్లో కాలు కదిపారు. ఆ వీడియో కింద కామెంట్ కూడా రాశారు. ‘‘ ‘భాంగ్రా ఎంపైర్’ నుంచి వధువు వస్తుందని తెలియగానే.. ఆ డ్యాన్స్‌ను ఇష్టపడేవారికి ట్యాగ్ చేయండి’’ అని కామెంట్ రాశారు. ‘భాంగ్రా ఎంపైర్’ అనేది ఒక డ్యాన్స్ టీమ్. కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న బే ఏరియాలో 2006లో స్థాపించారు. ఆ బృందంలోని వధువే రాణి అర్పవల్లీ. ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు రోజుల క్రితం ఆ వీడియోను షేర్ చేయగా 60,500లైక్స్ వచ్చాయి.