హాలీవుడ పాటకు భాంగ్రా స్లైల్‌లో స్టెప్పులేసిన పెళ్లి కూతురు

ABN , First Publish Date - 2022-01-24T01:59:01+05:30 IST

పాశ్చాత్య సంగీతాభిమానులకు ఎడ్ షీరన్ సుపరిచితమే. అతడి పాట ‘షేప్ ఆఫ్ యూ’కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు

హాలీవుడ పాటకు భాంగ్రా స్లైల్‌లో స్టెప్పులేసిన పెళ్లి కూతురు

పాశ్చాత్య సంగీతాభిమానులకు ఎడ్ షీరన్ సుపరిచితమే. అతడి పాట ‘షేప్ ఆఫ్ యూ’కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆ పాటకు ఒక పెళ్లి కూతురు  స్టెప్పులేసింది. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా విపరీతంగా ఆ వీడియోను షేర్ చేస్తున్నారు.  


ఆ వీడియోలో.. పెళ్లి కూతురితో పాటు మరికొందరు స్టెప్పులేస్తున్నారు. ఆమె పెళ్లి రోజు అందరు నవ్వుతూ పర్ఫామెన్స్ ఇస్తున్నారు. ఎడ్ షీరన్ పాటకు ప్రతి ఒక్కరు భాంగ్రా స్టైల్‌లో కాలు కదిపారు.  ఆ వీడియో కింద కామెంట్ కూడా రాశారు. ‘‘ ‘భాంగ్రా ఎంపైర్’ నుంచి వధువు వస్తుందని తెలియగానే.. ఆ డ్యాన్స్‌ను ఇష్టపడేవారికి ట్యాగ్ చేయండి’’ అని కామెంట్ రాశారు. ‘భాంగ్రా ఎంపైర్’ అనేది ఒక డ్యాన్స్ టీమ్. కాలిఫోర్నియా‌లోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న బే ఏరియాలో 2006లో స్థాపించారు. ఆ బృందంలోని వధువే రాణి అర్పవల్లీ. ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు రోజుల క్రితం ఆ వీడియోను షేర్ చేయగా 60,500లైక్స్ వచ్చాయి.



Updated Date - 2022-01-24T01:59:01+05:30 IST