సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Kidney Failure: మహాభారత నటుడి మృతి.. 65 ఏళ్ల వయస్సులో..

ABN, First Publish Date - 2022-07-30T17:38:57+05:30

కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా నటుడు రసిక్ దవే 65 ఏళ్ల వయసులో శుక్రవారం (జులై 29)న ముంబైలో మరణించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా నటుడు రసిక్ దవే 65 ఏళ్ల వయసులో శుక్రవారం (జులై 29)న ముంబైలో మరణించారు. రసిక్ గత రెండేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన అంత్యక్రియలు శనివారం (జులై 30)న నిర్వహించనున్నారు. రసిక్ అనేక గుజరాతీ నాటకాలు, గుజరాతీ చిత్రాలతో పాటు హిందీ టీవీ షోలలో నటించి నటుడిగా గుర్తింపు సాధించారు.


రసిక్ 1982లో వచ్చిన ‘పుత్ర వధు’ అనే గుజరాతీ చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం ఎన్నో గుజరాతీ సినిమాలు, టీవీ షోల నటించి మంచి పాపులారిటీ సాధించారు. ‘సంస్కార్ ధరోహర్ అప్నాన్ కీ’లో కర్సందాస్ ధన్సుఖ్లాల్ వైష్ణవ్ పాత్రతో ఆయనకి మంచి పేరు వచ్చింది. అంతేకాకుండా.. 1980లలో ప్రసారమైన మహాభారత పురాణ టెలివిజన్ ధారావాహికలో నంద్ పాత్రను పోషించి ఆ గుర్తింపును ఇంకా పెంచుకున్నారు. అలాగే.. 2006లో ‘నాచ్ బలియే’ అనే డ్యాన్స్ రియాలిటీ టీవీ షోలో పాల్గొన్నారు. ఈయన కేత్కి దవే అనే నటిని పెళ్లి చేసుకున్నారు. ఆమె కూడా గుజరాత్‌లో పాపులర్ నటే. ఈ జంటకి ఈ జంటకి ఓ కుమారుడు, ఓ కూతురు ఉన్నారు.


కాగా.. ఒక నివేదిక ప్రకారం.. రాసిక్ గత రెండు సంవత్సరాలుగా మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. అప్పటి నుంచి రెగ్యూలర్‌గా డయాలసిస్‌లో చేయించుకుంటున్నారు. అయితే తాజాగా ఆయన కిడ్నీలు బాగా క్షీణించి గత నెల రోజులుగా చాలా ఇబ్బంది పడుతూ.. జులై 28న తుది శ్వాస విడిచారు. దీంతో ఎంతోమంది ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా రసిక్‌కి నివాళులు అర్పిస్తున్నారు. ‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని’ కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2022-07-30T17:38:57+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!