Gautham Menon: నేను మణిరత్నం అంటూ చమత్కారంగా సమాధానం
ABN , First Publish Date - 2022-09-22T22:13:50+05:30 IST
సెన్సిబుల్ సినిమాల దర్శకుడు గౌతమ్ మీనన్ (Gautham Menon). తాజాగా ‘లైఫ్ ఆఫ్ ముత్తు’ (Life of Muthu)కు దర్శకత్వం వహించాడు. శింబు హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

సెన్సిబుల్ సినిమాల దర్శకుడు గౌతమ్ మీనన్ (Gautham Menon). తాజాగా ‘లైఫ్ ఆఫ్ ముత్తు’ (Life of Muthu)కు దర్శకత్వం వహించాడు. శింబు హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. నాలుగు రోజుల్లోనే రూ. 50కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ‘లైఫ్ ఆఫ్ ముత్తు’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు గౌతమ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా యాంకర్ గౌతమ్ గురించి తెలుసుకోకుండా వచ్చాడు. ‘నవాబ్’ (Nawab) కు గౌతమే దర్శకత్వం వహించాడని అనుకున్నాడు. శింబు (Simbu), విజయ్ సేతుపతి (Vijay Sethupathi)ని ఏ విధంగా హ్యాండిల్ చేశారని గౌతమ్‌ని అడిగాడు. అయితే, ‘నవాబ్’ కు దర్శకత్వం వహించింది మణిరత్నం (Mani Ratnam). ఈ సందర్భంగా గౌతమ్ అసహనానికి లోను కాకుండా ఆసక్తికరంగా సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.
గౌతమ్ వాసుదేవ మీనన్ చెప్పిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, అరవింద్ స్వామిలతో పని చేయడం చాలా కష్టం. వారందరు చాలా బిజిగా ఉంటారు. అందువల్ల వారి డేట్స్‌ను సంపాదించడం కొంచెం కష్టం. కానీ, నేను మణిరత్నం. అందువల్ల నేను ఎప్పుడు కాల్ చేసినా వారు సులభంగా దొరికేవారు. నేను ఉదయం 4.30 నుంచి 5గంటలకే షూటింగ్‌ను ప్రారంభిస్తాను. అందరు అప్పటికి వచ్చే వారు. గౌతమ్ మీనన్ షూటింగ్‌కు ఉదయం 7గంటలకు కూడా శింబు రాడని మీరు వినే ఉంటారు. కానీ, మణి సార్ షూటింగ్‌కు మాత్రం శింబు ఉదయం 4.30గంటలకే వస్తాడు. అతడితో పని చేయడం అద్భుతంగా ఉంది’’ అని గౌతమ్ తెలిపాడు. నిజం చెప్పాలంటే మణిరత్నంకు గౌతమ్ మీనన్ వీరాభిమాని. మణి నుంచే స్ఫూర్తి పొంది గౌతమ్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఇక గౌతమ్ మీనన్ కెరీర్ విషయానికి వస్తే.. హీరో రామ్‌తో ఓ సినిమాను చేయనున్నట్టు తెలిపాడు. అప్పుడప్పుడు మూవీస్‌లో కూడా తళుక్కున మెరుస్తుంటాడు. తాజాగా ‘సీతారామంలో నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. లోకేశ్ కనకరాజ్ తెరకెక్కించబోయే మూవీలో విలన్ పాత్రను చేయనున్నట్టు వదంతులు హల్చల్ చేస్తున్నాయి.