సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Fahadh Faasil: పదవ తరగతి పరీక్షలు రాసిన ఫహద్ ‘అమ్మ’!

ABN, First Publish Date - 2022-09-13T22:26:15+05:30

విభిన్న సినిమాలు విలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil). ‘ట్రాన్స్’, ‘సూపర్ డీలక్స్’, ‘మహేశింటే ప్రతీకారమ్’ (Maheshinte Prathikaram) సినిమాలతో ప్రేక్షకులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విభిన్న సినిమాలు విలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil). ‘ట్రాన్స్’, ‘సూపర్ డీలక్స్’, ‘మహేశింటే ప్రతీకారమ్’ (Maheshinte Prathikaram) సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా ‘పుష్ప: ది రైజ్’ లో పోలీసాఫీసర్ పాత్రను పోషించి ఉత్తరాది వారికి కూడా చేరువయ్యాడు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ‘మహేశింటే ప్రతీకారమ్’ లో ఫహద్‌‌కు తల్లిగా లీనా ఆంటోనీ (Leena Antony) నటించింది. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మెప్పు కూడా పొందింది. లీనా తాజాగా పదవ తరగతి పరీక్షలు రాసింది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  


లీనా ఆంటోనీ సెప్టెంబర్ 12న పదవతరగతి పరీక్షలకు హాజరయ్యింది. చేర్తాల గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్‌‌‌లో ఎగ్జామ్ రాసింది. లీనా 10వ తరగతి చదువుతున్నప్పుడే ఆమె తండ్రి కలరాతో మరణించాడు. అందువల్ల కుటుంబ బాధ్యతలు ఆమె మీద పడ్డాయి. దీంతో పాఠశాల విద్యను పూర్తి చేయలేకపోయింది. 13ఏళ్లకే నటించడం ప్రారంభించింది. తాజాగా ఆమె సన్నిహితులు పదవ తరగతి పరీక్షలు రాయాలని ప్రోత్సహించడంతో 73ఏళ్ల వయసులో ఎగ్జామ్స్ రాసింది. ‘మహేశింటే ప్రతీకారమ్’ కు దిలీష్ పోతాన్ (Dileesh Pothan) దర్శకత్వం వహించాడు. లీనా ఆంటోనీ, ఆమె భర్త కేఏల్.ఆంటోనీ ఈ చిత్రంలో ఫహద్‌కు తల్లిదండ్రులుగా నటించారు. ఈ జంటకు అందరు ఫిదా అయ్యారు. వీరి నటనకు ప్రేక్షకుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. మాలీవుడ్‌లో ‘మహేశింటే ప్రతీకారమ్’ సంచలన విజయం సాధించింది. దీంతో టాలీవుడ్‌లో ఈ చిత్రాన్ని ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ పేరుతో రీమేక్ చేశారు. ఈ మూవీలో సత్య దేవ్ హీరోగా నటించాడు. 

Updated Date - 2022-09-13T22:26:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!