30 ఏళ్ళ తర్వాత వెండితెరపై ఎవర్‌గ్రీన్‌ జోడీ

ABN , First Publish Date - 2022-03-26T00:45:15+05:30 IST

వీరిద్దరు 1992లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ ‘రాసుకుట్టి’ సినిమాలో నటించారు. ఆ తర్వాత ఇపుడు యంగ్‌ హీరోకు తల్లిదండ్రులుగా వెండితెరపై కనిపించనున్నారు. దీంతో ఈ చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ జంటను తెరపై చూసేందుకు..

30 ఏళ్ళ తర్వాత వెండితెరపై ఎవర్‌గ్రీన్‌ జోడీ

తమిళ వెండితెరపై ఎవర్‌గ్రీన్‌ జంటగా గుర్తింపు పొందిన సీనియర్‌ నటీనటులు కె.భాగ్యరాజ్‌, ఐశ్వర్య.. మూడు దశాబ్దాల తర్వాత ప్రేక్షకులను ఆలరించనున్నారు. ఒలింపియా మూవీస్‌ అధినేత ఎస్‌.అంబేత్‌ కుమార్‌ ‘ప్రొడక్షన్‌ నెం.4’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో.. గణేష్‌ కె.బాబు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. కెవిన్‌, అపర్ణా దాస్‌ హీరోహీరోయిన్లు. రొమాన్స్‌, కామెడీ, ఎమోషనల్‌ టచ్‌తో నిర్మించే ఈ సినిమా షూటింగ్‌ ఈ నెల మొదటి వారం నుంచి ప్రారంభమై శరవేగంగా జరుపుకుంటుంది. 


అయితే, ఇందులో హీరో తల్లిదండ్రులుగా కె.భాగ్యరాజ్‌, ఐశ్వర్య నటిస్తున్నారు. వీరిద్దరు 1992లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ ‘రాసుకుట్టి’ సినిమాలో నటించారు. ఆ తర్వాత ఇపుడు యంగ్‌ హీరోకు తల్లిదండ్రులుగా వెండితెరపై కనిపించనున్నారు. దీంతో ఈ చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ జంటను తెరపై చూసేందుకు కోలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి జెన్‌ మార్టిన్‌ సంగీతం సమకూర్చుతున్నారు.

Updated Date - 2022-03-26T00:45:15+05:30 IST