సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

హీరో విజయ్‌కి షాకిచ్చిన ఎన్నికల సంఘం

ABN, First Publish Date - 2022-01-29T21:32:23+05:30

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌కి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. పురపాలక సంస్థల ఎన్నికల్లో విజయ్ పార్టీ అడిగిన గుర్తును కేటాయించేందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌కి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. పురపాలక సంస్థల ఎన్నికల్లో విజయ్ పార్టీ అడిగిన గుర్తును కేటాయించేందుకు ఎలక్షన్ కమిషన్ నిరాకరించింది. వివరాల్లోకి వెళ్లితే..


ఇళయ దళపతి విజయ్ అభిమానులు ‘విజయ్ మక్కల్ ఇయకం(విఎమ్‌ఐ)’ అనే పార్టీ పేరుతో తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేశారు. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన ఈ ఎన్నికల్లో ఆ పార్టీ మూడో స్థానంలో నిలిచింది. త్వరలోనే తమిళనాడులో పురపాలక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. తన అభిమాన సంఘం ప్రతినిధులు ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలోస్తున్నాయి. తాజాగా.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు విఎమ్‌ఐ ముఖ్య నాయకుడు బుస్సీ ఆనంద్ చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘ హీరో విజయ్ త్వరలోనే మీరు ఆశించే విధంగా ప్రకటన చేస్తారు. ప్రతి జిల్లా నుంచి దాదాపుగా 300మంది పోటీ చేస్తారు. పార్టీకి గుర్తుగా ఆటోని కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని కోరాం’’ అని ఆయన చెప్పారు.


ఎన్నికల సంఘం మాత్రం విఎమ్‌ఐ పార్టీ అభ్యర్థనను తిరస్కరించింది. ఆ గుర్తును కేటాయించేందుకు నిరాకరించింది. ‘‘ఆ పార్టీకి ఆటో గుర్తును కేటాయించలేం. మా వద్ద నమోదైన పార్టీలకు మాత్రమే ఆ గుర్తును కేటాయిస్తాం’’ అని ఎలక్షన్ కమిషన్ ఒక ప్రకటనలో తేల్చి చెప్పింది. పురపాలక సంఘ ఎన్నికలు ఫిబ్రవరి 19న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 22న వెలువరిస్తారు.

Updated Date - 2022-01-29T21:32:23+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!