టైటిల్‌ ఆధారంగా జడ్జిమెంట్‌ ఇవ్వరాదు: vigneshwarankaruppusamy

ABN , First Publish Date - 2022-07-08T16:46:03+05:30 IST

ఒక చిత్రం టైటిల్‌ ఆధారంగా ఆ సినిమా కథను జడ్జిమెంట్‌ చేయరాదని కొత్త దర్శకుడు విఘ్నేశ్వరన్‌ కరుప్పస్వామి (vigneshwarankaruppusamy) మీడియాకు విఙ్ఞప్తి చేశారు.

టైటిల్‌ ఆధారంగా జడ్జిమెంట్‌ ఇవ్వరాదు: vigneshwarankaruppusamy

ఒక చిత్రం టైటిల్‌ ఆధారంగా ఆ సినిమా కథను జడ్జిమెంట్‌ చేయరాదని కొత్త దర్శకుడు విఘ్నేశ్వరన్‌ కరుప్పస్వామి (vigneshwarankaruppusamy) మీడియాకు విఙ్ఞప్తి చేశారు. తాను దర్శకత్వం వహించిన ‘ఫారిన్‌ సరక్కు’ (Foreign Sarakku) చిత్రం విశేషాలను ఆయన తాజాగా జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ‘ఇది సస్పెన్స్‌ యాక్షన్‌ మూవీ. జూలై 8వ తేదీన విడుదల చేస్తున్నాం. ఇందులో నటించిన వారంతా కొత్తవారే. కొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలను పోషించిన గోపీనాథ్‌, సుందర్‌లకు ఇది తొలి సినిమా అయినప్పటికీ ఎంతో అద్భుతంగా నటించారు. వీరితో పాటు హుస్సేన్‌, సురేందర్‌, ఆఫ్రినా, హరిణి, ఇలక్కియ తదితరులు ఇతర ప్రధాన పాత్రలను పోషించారు. 


ప్రవీణ రాజ్‌ సంగీతం, పాటలు కథకు ప్రధాన బలం. ముఖ్యంగా నేపథ్య సంగీతం ఎంతో కీలకం. యాక్షన్‌ సన్నివేశాల్లో వచ్చే బీజీఎం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుంది. అయితే, ఈ సినిమాకు ‘ఫారిన్‌ సరక్కు’ అనే టైటిల్‌ పెట్టినప్పటికీ ఒక్క సన్నివేశంలో కూడా మద్యం సేవించడం, పొగతాగడం వంటి సీన్లు లేకుండానే కథను ముందుకు తీసుకెళ్ళాం. ముఖ్యంగా ఉద్యోగం కోసం చెప్పులు అరిగిపోయేలా తిరగకుండా తమకున్న బుద్ధిబలం, ప్రతిభతో సొంత కాళ్ళపై యువత నిలబడాలన్న ఒక సందేశంతో ఈ సినిమాను రూపొందించాం.


ఇందులో నటించిన కొత్తవారే అయినప్పటికీ నటనలో ఏమాత్రం రాజీపడలేదు. కానీ, బడ్జెట్‌ కారణంగా మేకింగ్‌లో కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆలరిస్తుందన్న నమ్మకం ఉంది. చిత్ర కథను చెప్పాలంటే. ఒక మంత్రి కుమారుడిని కిడ్నాప్‌ చేస్తారు. అతన్ని దాచిన ప్రాంతాలన్ని బుద్ధిమంతులైన కొంతమందితో కూడిన బృందం సభ్యులు ఎలా కనుక్కున్నారన్నదే ఈ చిత్ర కథ. ఈ ఆపరేషన్‌ కోసం ఉయోగించిన కోడ్‌ లాంగ్వేజ్‌ ‘ఫారిన్‌ సరక్కు’.. అని దర్శకుడు వివరించారు. 

Updated Date - 2022-07-08T16:46:03+05:30 IST