సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sharad Pawar కు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన నటికి బెయిల్.. అయినప్పటికి జైల్లోనే..

ABN, First Publish Date - 2022-06-17T02:32:42+05:30

మరాఠీ నటి కేతకి చితాలే (Ketaki Chitale) ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్‌ (Sharad Pawar) పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో పవార్‌ను ఉద్దేశించి ఆమె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరాఠీ నటి కేతకి చితాలే (Ketaki Chitale) ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్‌ (Sharad Pawar) పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో పవార్‌ను ఉద్దేశించి ఆమె గతంలో పరోక్షంగా అనుచిత పోస్ట్ పెట్టారు. ‘‘బ్రహ్మణులను ద్వేషిస్తున్న మీ కోసం నరకం ఎదురు చూస్తోంది’’ అని పవార్‌ను ఉద్దేశిస్తూ ఆ పోస్టులో రాశారు. అందులో పవార్ వయసును 80గా పేర్కొన్నారు. కానీ, శరద్ పవార్ అసలు వయసు 81ఏళ్లు. ఫలితంగా కేతికికి వ్యతిరేకంగా 20కేసులు నమోదయ్యాయి. దీంతో ముంబైలోని థానే పోలీసులు మే 14న ఆమెను అరెస్టు చేశారు. ఈ కేసులో భాగంగా నెల రోజుల నుంచి ఆమె జైల్లోనే ఉన్నారు. 


కుల, మతాల మధ్య విభేదాలు సృష్టించేలా పోస్ట్ పెట్టినందుకు ఆమెపై పోలీసులు కేసును నమోదు చేశారు. ఫలితంగా ఆమె గతంలోనే కోర్టు మెట్లెక్కింది. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ నేరాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయలేదు. తాజాగా థానే కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ ఆమెకు వ్యతిరేకంగా 20కేసులు నమోదు కావడంతో ప్రస్తుతం జైల్లోనే ఉండాల్సి వస్తుంది. దీంతో బాంబే హైకోర్టులో కేతకి పిటిషన్ దాఖలు చేశారు.  ఆ పిటిషన్‌లో..‘‘చట్టాన్ని అనుసరించి నా అరెస్టు జరగలేదు. నన్ను అరెస్టు చేయడం చట్ట విరుద్ధం. వేరే వ్యక్తి మరాఠీలో రాసిన పోస్ట్‌ను నేను షేర్ చేశాను. పవార్ అనే ఇంటి పేరు‌ను మాత్రమే నేను ప్రస్తావించాను. వయసును కూడా 80గా పేర్కొన్నాను. కానీ, శరద్ పవార్ అసలు వయసు 81ఏళ్లు’’ అని ఆ పిటిషన్ లో ఆమె పేర్కొన్నారు. ఆమె గతంలో కూడా దర్యాప్తును ఆపాలంటూ హైకోర్టు మెట్లెక్కారు. కేతకి చితాలేతో పాటు నిఖిల్ భర్మే అనే ఫార్మసీ స్టూడెంట్ కూడా శరద్ పవార్‌కు వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. నిఖిల్‌కు వ్యతిరేకంగా ఆరు కేసులు నమోదయ్యాయి. నెల రోజుల నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు.

Updated Date - 2022-06-17T02:32:42+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!