సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సామ్ ధరించిన చీర ఖరీదు తెలిస్తే షాకే..

ABN, First Publish Date - 2022-02-27T21:00:01+05:30

నాగ చైతన్యతో విడాకుల అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగ చైతన్యతో విడాకుల అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది సమంత. భారీ బడ్జెట్ చిత్రాలకు ఒకే చెబుతూ జోరు చూపిస్తోంది. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటూ అభిమానులను పలకరిస్తోంది.


తాజాగా సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. తెలుపు రంగు పట్టు చీరను ధరించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఆ చీర మీద ఎంబ్రాయిడరీ ఉంది. మ్యాచింగ్ జ్యువేలరీని కూడా సామ్ ధరించింది. ఈ చీరను చూసి అభిమానులు ఫిదా అయ్యారు. అంతేకాకుండా ఆమె ధరించిన చీర ధర ఎంత అని ఆరా తీయడం ప్రారంభించారు. తాజాగా నెటిజన్లు అవాక్కయ్యే విషయం వెలుగులోకి వచ్చింది. సామ్ ధరించిన చీర ఖరీదు వివరాలు బయటకొచ్చాయి. ఈ చీర ధర దాదాపుగా రూ.1.15లక్షలు ఉంటుందని తెలిసింది.  


ప్రస్తుతం సమంత ‘శాకుంతలం’ లో నటిస్తుంది. ఈ మూవీని ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు. మహా భారతంలోని ఆది పర్వంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్‌లో ‘యశోద’ తో పాటు, హాలీవుడ్‌లో ‘‘ది అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్’’ అనే చిత్రంలో నటిస్తుంది.



Updated Date - 2022-02-27T21:00:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!