ఓటీటీలోకి వచ్చేస్తున్న మార్వెల్స్ Doctor Strange in the Multiverse of Madness

ABN , First Publish Date - 2022-06-04T01:11:26+05:30 IST

మార్వెల్ స్టూడియోస్ (Marvel Studios) నుంచి వచ్చే సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులుంటారు. ఆ స్టూడియో నుంచి వచ్చిన ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కొన్ని రోజు

ఓటీటీలోకి వచ్చేస్తున్న మార్వెల్స్ Doctor Strange in the Multiverse of Madness

మార్వెల్ స్టూడియోస్ (Marvel Studios) నుంచి వచ్చే సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులుంటారు. ఆ స్టూడియో నుంచి వచ్చిన ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కొన్ని రోజుల క్రితమే మార్వెల్స్ నుంచి వచ్చిన చిత్రం ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవెర్స్ ఆఫ్ మాడ్‌నెస్’( Doctor Strange in the Multiverse of Madness). 2016లో విడుదలైన ‘డాక్టర్ స్ట్రేంజ్’కు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. అమెరికన్ సూపర్ హీరోను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. బెన్‌డిక్ట్ కంబర్ బ్యాచ్ (Benedict Cumberbatch) హీరోగా నటించాడు. ‘స్పైడర్ మ్యాన్’ చిత్రాల దర్శకుడు సామ్ రైమీ తెరకెక్కించాడు. ఈ మూవీ మే 6న విడుదల అయింది. ఈ సినిమాను థియేటర్స్‌లో మిస్ అయిన వారంతా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకుల ఎదురు చూపులకు తెర దించుతూ డిజిటల్ ప్లాట్‌ఫాం స్ట్రీమింగ్ తేదీని ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. 


‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవెర్స్ ఆఫ్ మాడ్‌నెస్’ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ+హాట్ స్టార్‌ లో జూన్ 22నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుందని డిజిటల్ ప్లాట్‌ఫాం తెలిపింది. ‘డాక్టర్ స్ట్రేంజ్’ భారత్‌లో రూ. 100కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది.Updated Date - 2022-06-04T01:11:26+05:30 IST

Read more