Disha Pathani : కోలీవుడ్ ఎంట్రీ ఖాయం?

ABN , First Publish Date - 2022-08-23T18:48:57+05:30 IST

వరుణ్ తేజ్ (Varun Tej), పూరీ జగన్నాథ్ (Puri Jagannath) చిత్రం ‘లోఫర్’ (Loafer) తో టాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది దిశ పాటాని (Dishaq Patani). ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో దిశకు సరైన గుర్తింపు రాలేదు.

Disha Pathani : కోలీవుడ్ ఎంట్రీ ఖాయం?

వరుణ్ తేజ్ (Varun Tej), పూరీ జగన్నాథ్ (Puri Jagannath) చిత్రం ‘లోఫర్’ (Loafer) తో టాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది దిశ పాటాని (Dishaq Patani). ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో దిశకు సరైన గుర్తింపు రాలేదు. దాంతో ఆమె బాలీవుడ్‌కు షిఫ్ట్ అయింది. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (Sushanth Singh Rajputh) హీరోగా నటించిన స్పోర్ట్స్ బయోపిక్ ‘యం.యస్. ధోని ది అన్‌టోల్డ్ స్టోరీ’ (MS Dhoni : The Untold Story) చిత్రంలో హీరోయిన్ గా నటించింది. తొలి ప్రయత్నంతోనే దిశ దశ తిరిగింది. ఆ తర్వాత ‘కుంగ్‌ఫూ యోగ, వెల్‌కమ్ టు న్యూయార్క్, భాగి 2, భారత్, మలంగ్, భాగీ 3, రాధే, ఏక్ విలన్ రిటర్న్స్ చిత్రాలతో స్టార్ స్టాటస్ తెచ్చుకుంది దిశ. ప్రస్తుతం సిద్ధార్ధ్ మల్హోత్రా (Siddharth Malhotra) ‘యోధ’ (Yodha) లో కథానాయికగా నటిస్తోంది. అలాగే మరో సినిమాలోనూ కీలక పాత్రలో నటిస్తోంది. 


ఇదిలా ఉండగా.. దిశ దృష్టి మళ్ళీ దక్షిణాదిపై పడింది. ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) , నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘ప్రాజెక్ట్ కె’ (Project K) లో ప్రత్యేక పాత్ర పోషిస్తోంది దిశా పటాని.  తాజాగా కోలీవుడ్ లోనూ దిశా పటానీ ఎంట్రీ ఖాయమైందని సమాచారం. తమిళ స్టార్ హీరో సూర్య (Surya) సరసన కథానాయికగా ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల సూర్య హీరోగా శివ (Shiva) దర్శకత్వంలో కొత్త సినిమాను ప్రకటించారు. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచయింది.  అధికారిక ప్రకటన రాకపోయినా..  కథానాయికగా దిశా పటానీని ఖాయం చేశారని వార్తలొస్తున్నాయి.


దిశా పటానీ రీసెంట్‌గా సోషల్ మీడియాలో సూర్య, శివ చిత్రం పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోస్ ను ట్యాగ్ చేసింది. దాంతో ఈ సినిమాలో ఆమెనే హీరోయిన్ గా నటిస్తోందని భావిస్తున్నారు. నిజానికి ఇందులో కథానాయికగా ముందు పూజా హెగ్డే పేరు వినిపించింది. ఫైనల్ గా దిశ ఎంపికైనట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు సూర్యతో కలిసి ఒక యాడ్ లో నటించింది దిశ. సూర్య కెరీర్‌లో ఇది 42వ చిత్రం. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 

Updated Date - 2022-08-23T18:48:57+05:30 IST