మొత్తానికి సినిమాను చూశానంటూ.. KGF 2 పై దర్శకుడు శంకర్ సెన్సేషనల్ కామెంట్స్..

ABN , First Publish Date - 2022-05-17T23:19:14+05:30 IST

కోలీవుడ్ దర్శకుడు శంకర్ భారీ చిత్రాలకు కేరాఫ్. అటువంటి బిగ్ డైరెక్టర్ ఎట్టకేలకు ‘కేజీఎఫ్ 2’ చూశారట. ఇంతకీ, యశ్ స్టారర్ మాస్ ఎంటర్టైనర్ చూసి శంకర్ ఏమన్నారంటే...

మొత్తానికి సినిమాను చూశానంటూ.. KGF 2 పై దర్శకుడు శంకర్ సెన్సేషనల్ కామెంట్స్..

కోలీవుడ్ దర్శకుడు శంకర్ భారీ చిత్రాలకు కేరాఫ్. అటువంటి బిగ్ డైరెక్టర్ ఎట్టకేలకు ‘కేజీఎఫ్ 2’ చూశారట. ఇంతకీ, యశ్ స్టారర్ మాస్ ఎంటర్టైనర్ చూసి శంకర్ ఏమన్నారంటే... 


మంగళవారం ‘కేజీఎఫ్ చాప్టర్ 2’పై తన రివ్యూ ఇచ్చిన డైరెక్టర్ శంకర్ ‘అద్భుతం’ అంటూ కామెంట్ చేశారు. ట్వీట్టర్ లో ఆయన ... “Finally saw #KGF2 Cutting edge style Storytelling,Screenplay&Editing.Bold move to intercut action&dialogue,worked beautifully.Revamped Style of Mass 4 the powerhouse @TheNameIsYash Thanks Dir @prashanth_neel 4 giving us a “periyappa” experience. @anbariv Terrific to the Team (sic),” అంటూ రాసుకొచ్చారు. తమిళంలో ‘పెరియప్ప’ అంటే గొప్ప, పెద్ద అన్న అర్థాలు తీసుకోవచ్చు. ‘కేజీఎఫ్ 2’ ఓ సూపర్బ్ బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ అంటున్నారు టాలెంటెడ్ డైరెక్టర్. 


‘కేజీఎప్ 2’ స్టోరీటెల్లింగ్, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్... అన్నీ భేష్ అంటూ మెచ్చుకున్న శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో మూవీ చేస్తూ బిజీగా ఉన్నారు. ‘ఆర్ సీ 15’ కారణంగా ‘కేజీఎఫ్ 2’ విడుదలైన వెంటనే చూడలేకపోయిన ఆయన తాజాగా తన అభిప్రాయం ట్విట్టర్ లో పంచుకున్నారు. అయితే, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ ఇప్పటికే ఓటీటీకి చేరిపోయింది. అమేజాన్ ప్రైమ్ వీడియోపై రెంటల్ బేసిస్ లో అందుబాటులో ఉంది. ప్రేక్షకులు ప్రీమియమ్ అమౌంట్ చెల్లించి సినిమా చూడవచ్చు... 


‘కేజీఎప్ 2’ ఏప్రెల్ 14న బాక్సాఫీస్ వద్ద రిలీజై వసూళ్ల తుఫాను రేపిన సంగతి మనకు తెలిసిందే. ‘కేజీఎప్ చాప్టర్ 1’ తీసుకొచ్చిన హైప్ తో తాజా సీక్వెల్ కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజే 134 కోట్లు వసూలుకాగా మొత్తం థియేట్రికల్ రన్ పూర్తయ్యే నాటికి కేవలం ఇండియాలోనే వెయ్యి కోట్ల మైలురాయి దాటేసింది ‘కేజీఎఫ్ 2’ సినిమా. రాజమౌళి ‘బాహుబలి’ తరువాత ఇంతలా బాక్సాఫీస్ కొల్లగొట్టిన చిత్రం ఇదే కావటం విశేషం...  


కన్నడ సినిమాగా మొదలైన ‘కేజీఎఫ్’ ప్రస్థానం తెలుగు, తమిళ, మలయాళ భాషల మీదుగా బాలీవుడ్ దాకా కొనసాగింది. కేవలం హిందీ మార్కెట్లోనే ‘కేజీఎఫ్’ 420 కోట్లు ఆర్జించింది. 5వ వారంలోనూ అన్ స్టాపబుల్ గా దూసుకెళుతోంది. సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి సీనియర్ బాలీవుడ్ స్టార్స్ నటించిన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ స్ట్రెయిట్ హిందీ మూవీస్ కి పట్టపగలు చుక్కలు చూపించింది. ‘జెర్సీ, హీరోపంతి, రన్ వే 34, జయేశ్ భాయ్ జోర్ధార్’ లాంటి సినిమాలు ఈ మధ్య కాలంలో రాకీ భాయ్ ముందు చేతులెత్తేశాయి! 

Updated Date - 2022-05-17T23:19:14+05:30 IST

Read more