సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Shankar: దర్శకుడు శంకర్‌కు గౌరవ డాక్టరేట్

ABN, First Publish Date - 2022-08-06T01:37:34+05:30

భారీ బడ్జెట్‌తో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు శంకర్ (Shankar). భారతీయ సినీ చిరిత్రలో అతడికీ ప్రత్యేక స్థానం ఉంది. ‘రోబో’, ‘ఐ’, ‘2.O’ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. తాజాగా ఓ యూనివర్శిటీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారీ బడ్జెట్‌తో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు శంకర్ (Shankar). భారతీయ సినీ చిరిత్రలో అతడికీ ప్రత్యేక స్థానం ఉంది. ‘రోబో’, ‘ఐ’, ‘2.O’ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా ఓ యూనివర్శిటీ శంకర్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


పల్లవరంలోని వేల్స్ విస్టాస్ క్యాంపస్ 12వ వార్షిక స్నాత‌కోత్సావాన్ని ఆగస్టు 5న జరుపుకొంది. ఈ సందర్భంగా విశ్వ విద్యాలయం శంకర్‌కు గౌరవ డాక్టరేట్‌ను అందజేసింది. చిత్ర పరిశ్రమకు అతడు అందించిన సేవలను కొనియాడుతూ ఈ డాక్టరేట్‌ డిగ్రీని అందించింది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్స్ ఈ పిక్స్ కింద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. శంకర్‌తో పాటే భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకు కూడా విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ డిగ్రీని అందించింది. శంకర్ త్వరలోనే ‘ఇండియన్-2’ (Indian 2) షూటింగ్‌ను ప్రారంభించనున్నాడు. గతంలో అతడు తెరకెక్కించిన ‘ఇండియన్’కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్నాడు. కాజల్ అగర్వాల్, ప్రియా భవానీ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్ చరణ్ నటిస్తున్న సినిమాను శంకర్ ఇప్పటికే తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ గా ‘ఆర్‌సీ-15’ అని పెట్టారు. కియారా అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదల కానుంది.  

Updated Date - 2022-08-06T01:37:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!