సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Arpita Mukherjee: సామాన్య యువతిగా ప్రయాణాన్ని ప్రారంభించి కోట్లకు పడగలెత్తిన హీరోయిన్

ABN, First Publish Date - 2022-07-31T00:24:23+05:30

పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఎస్‌సీ (School Service Commission) స్కామ్‌ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) మంత్రి పార్థా ఛటర్జీ (Partha Chatterjee), అతడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఎస్‌సీ (School Service Commission) స్కామ్‌ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) మంత్రి పార్థా ఛటర్జీ (Partha Chatterjee), అతడి సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ (Arpita Mukherjee)ఆరోపణలు ఎదుర్కొటున్నారు. కొన్ని రోజుల క్రితం అర్పిత నివాసంలో ఈడీ సోదాలు జరపగా రూ. 21కోట్ల నగదు లభించింది. దీంతో అందరు ఎవరీ అర్పిత అని ఆరా తీయడం మొదలుపెట్టారు...  


అర్పితా ముఖర్జీ‌ది ఉత్తర కోల్ కతాలోని బెల్గోరియా ప్రాంతం. మోడలింగ్‌లో ఉన్న పరిచయాల ద్వారా సినీ ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చింది. ఒరియా, బెంగాలీ భాషలకు చెందిన లో బడ్జెట్ సినిమాల్లో ఆమెకు అవకాశాలు వచ్చాయి. ‘హృదయ్ లేకో నామ్’ (Hriday Lekho Nam) తో ఆమెకు మంచి బ్రేక్ వచ్చింది. ఈ మూవీతోనే మోనికా బేడీ రీ ఎంట్రీ ఇచ్చింది. అందరు ఈ చిత్రాన్ని మోనికా బేడీ రీ ఎంట్రీగా అభివర్ణించడంతో అర్పిత కోపం తెచ్చుకుంది. ప్రీమియర్‌కు డుమ్మా కొట్టింది. అర్పిత ముఖర్జీ కెరీర్‌లో ఉన్నత స్థాయికీ చేరుకోవాలనుకుంది. అందువల్ల పార్టీలు, ఫంక్షన్స్‌లో రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకోవడానికి ఆసక్తి చూపించింది. ఆమె 2013నుంచి పార్థా చటర్జీతో సన్నిహితంగా మెలగడం చూశామని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నారు. కెరీర్ తొలినాళ్లల్లో ఉన్న పరిచయాలను కొనసాగించేందుకు  ఇష్టపడలేదని వారు పేర్కొంటున్నారు. అనంతరం ఆమె భారీగా ధనాన్ని కూడబెట్టింది. ఆడి, మెర్సిడెస్ బెంజ్ వంటి కార్లను సొంతం చేసుకుంది.  


అర్పిత నటించిన ‘హృదయ్ లేకో నామ్’ కు గౌతమ్ సహా(Gautam Saha) నిర్మాతగా వ్యవహరించాడు. అర్పిత గురించి గౌతమ్  అప్పట్లో  మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ‘‘హీరోయిన్ కావాలనుకుని ఇక్కడకు వచ్చానని అర్పిత చెప్పింది. ఆమె చూడటానికీ బాగుంటుంది. కానీ, అంతగా నటన మాత్రం రాదు. అటువంటి సమయంలో ఆమెను హీరోయిన్‌గా మేం తీసుకున్నాం. ఈ సినిమా 2011లో విడుదలై ఆమెకు గుర్తింపును తీసుకువచ్చింది. 2012నుంచి ఆమెలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. తరచుగా భారీ స్థాయి పార్టీల్లో కనిపించడం ప్రారంభమైంది. ఫేమ్ లభించాక నాతో అనుబంధాన్ని కొనసాగించడానికీ ఆసక్తి చూపించలేదు. మోనికా బేడీ రీ ఎంట్రీ సినిమాగా అందరూ ప్రస్తావిస్తుండటంతో అర్పితకు కోపం వచ్చింది. అందువల్ల ప్రీమియర్‌కు కూడా హాజరుకాలేదు. అనంతరం పెద్ద వ్యక్తులతో పరిచయం పెంచుకుంది. ఆ సమయంలోనే ఆమెతో పార్థా చటర్జీని చూశాను’’ అని గౌతమ్ సహా చెప్పాడు. 


శంగమిత్ర చౌదరీ (Shangamitra Chowdhury)  తెరకెక్కించిన మూడు సినిమాల్లో అర్పిత నటించింది. ‘‘నా మూడు సినిమాల్లో అర్పిత పనిచేసింది. అప్పట్లో ఆమెకు కారు కూడా ఉండేది కాదు. అనంతరం సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసింది. సినిమా సెట్స్‌లో ఆమె అద్భుతంగా ఉండేది. నేను 2013లో బీజేపీలో చేరాను. అనంతరం ఆమెతో నాకు సంబంధాలు తెగిపోయాయి. ఒకనాడు రోడ్డు మీద ఆమె హోర్డింగ్‌ను చూశాను. ఆమె కెరీర్‌లో రాణిస్తున్నందుకు సంతోషించాను. గత ఏడు రోజుల్లో జరిగిన దానిని చూసి మాత్రం షాక్ అయ్యాను. కొంత మంది రాజకీయ నాయకులు ఆమెను ఉపయోగించుకున్నారు’’ అని శంగమిత్ర చౌదరీ పేర్కొన్నాడు.

Updated Date - 2022-07-31T00:24:23+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!