Dhanush: సినీ కెరీర్‌కు రెండు దశాబ్దాలు

ABN , First Publish Date - 2022-05-12T20:00:11+05:30 IST

కోలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ స్థాయికి ఎదిగిన హీరో ధనుష్‌ (Dhanush).. చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు పూర్తయింది. ఈ శుభతరుణంలో తన తల్లిదండ్రులకు దర్శక నిర్మాతలకు,

Dhanush: సినీ కెరీర్‌కు రెండు దశాబ్దాలు

కోలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ స్థాయికి ఎదిగిన హీరో ధనుష్‌ (Dhanush).. చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు పూర్తయింది. ఈ శుభతరుణంలో తన తల్లిదండ్రులకు దర్శక నిర్మాతలకు, సినిమా టెక్నీషియన్లు, సినీ కార్మికులకు, తన అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ థ్యాంక్స్‌ లెటర్‌ విడుదల చేశారు. 2002 మే 10వ తేదీ ధనుష్‌ హీరోగా నటించిన తొలి చిత్రం ‘తుల్లువదో ఇలమై’ విడుదలై విజయవంతమైంది. ఆయన గానం చేసిన ‘వై దిస్‌ కొలవరి’ (Why This Kolavari) సాంగ్‌తో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. 


‘ది ఎక్స్‌టార్డినరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌’ అనే ఆంగ్లచిత్రంలో హీరోగా నటించి హాలీవుడ్‌ హీరోగా మారారు. 2013లో ‘రంఝానా’ అనే చిత్రం ద్వారా హిందీలోకి అడుగుపెట్టారు. ‘కాదల్‌ కొండేన్‌’, (Kadal Konden) ‘పుదుపేట’ (Pudu Peta) చిత్రాల్లో తన నటన మెరుగుపరుచుకున్న ధనుష్‌.. దర్శకుడు వెట్రిమారన్‌  ‘పొల్లాదవన్‌’ చిత్రంతో మరో మెట్టుకు ఎదిగారు. ఇదే వెట్రిమారన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అసురన్‌’ (Asuran) చిత్రానికి జాతీయ అవార్డును అందుకున్నారు. కేవలం నటనకు మాత్రమే పరిమితంకాకుండా, గేయరచయితగా, గాయకుడుగా, దర్శకుడు, నిర్మాత ఇలా అన్ని విభాగాల్లో తన ప్రతిభను నిరూపించుకుని కోలీవుడ్‌లోని అగ్రనటుల్లో ఒకరిగా ఉన్నారు. 


కాగా, ధనుష్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో ‘సార్’ (Sir) సినిమా చేస్తున్నారు. ఇందులో లెక్చరర్ పాత్రలో నటిస్తుండగా తమిళంలో ‘వాతి’ (Vaathi) అనే పేరుతో రూపొందుతోంది. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగ వంశీతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమని సాయి సౌందర్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అలాగే, క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ మొదలవ్వాల్సి ఉంది.

Updated Date - 2022-05-12T20:00:11+05:30 IST