ధనుష్ న్యూ మూవీ ఫస్ట్ లుక్..అసలు గుర్తుపట్టలేము..!

ABN , First Publish Date - 2022-03-27T15:07:35+05:30 IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గత కొంతకాలంగా పూర్తి విభిన్నమైన సినిమాలను చేస్తూ మంచి సక్సెస్‌లను అందుకుంటూన్నారు. ఈ క్రమంలోనే ఆయన క్రేజీ డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 'నానే వరువెన్'

ధనుష్ న్యూ మూవీ ఫస్ట్ లుక్..అసలు గుర్తుపట్టలేము..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గత కొంతకాలంగా పూర్తి విభిన్నమైన సినిమాలను చేస్తూ మంచి సక్సెస్‌లను అందుకుంటూన్నారు. ఈ క్రమంలోనే ఆయన క్రేజీ డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 'నానే వరువెన్' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. కళై పులి ఎస్ థాను ఈ సినిమాను వి క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ధనుష్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మూడు పదుల వయసులోనూ 16 ఏళ్ళ కుర్రాడిలా ఈ ఫస్ట్‌లుక్‌లో కనిపిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే మరోసారి ప్రయోగం చేస్తున్నారని అర్థమవుతోంది. ఇంతకముందు 'అసురన్' సినిమాలో 60 ఏళ్ళ వయసు కలిగిన పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా 'నానే వరువెన్' సినిమాలో 16 ఏళ్ళ కుర్రాడిగా కనిపించబోతున్నట్టు తాజాగా వదిలిన ఫస్ట్‌లుక్ చూస్తే తెలుస్తోంది. మొత్తగా చూస్తే ఈ సినిమాతోనూ ధనుష్ ఖాతాలో మరో హిట్ చేరబోతుందని అర్థమవుతోంది. కాగా, ఆయన టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న 'సార్' అనే సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇది పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోంది. 

Updated Date - 2022-03-27T15:07:35+05:30 IST