సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Dhanush: ధనుష్ - శేఖర్ కమ్ముల కాంబో మూవీ ప్రారంభం

ABN, First Publish Date - 2022-11-28T23:15:11+05:30

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ (Dhanush) దేశంలోని మంచి నటులలో ఒకరు. కెరీర్‌లో బెస్ట్ ఫేజ్‌ని ఎంజాయ్ చేస్తున్న ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ (Dhanush) దేశంలోని మంచి నటులలో ఒకరు. కెరీర్‌లో బెస్ట్ ఫేజ్‌ని ఎంజాయ్ చేస్తున్న ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్.. తొలి సినిమాతోనే నేషనల్ అవార్డ్ గెలుచుకుని, కళాత్మక విలువలతో కమర్షియల్ విజయాలని అందుకొంటున్న టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో కొత్త సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రేజీ మూవీ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకోనుంది.


నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (ఏషియన్ గ్రూప్ యూనిట్) నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయింది. వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేయనున్నారు. ప్రాజెక్ట్ కి సంబధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తారు.

Updated Date - 2022-11-28T23:15:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!