‘డాన్‌’ థియేట్రికల్‌ రైట్స్‌ ఎవరికంటే..!

ABN , First Publish Date - 2022-04-08T19:19:23+05:30 IST

కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్‌ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌ శిబి చక్రవర్తి దర్శకత్వంలో నిర్మించిన తాజా చిత్రం ‘డాన్‌’. ప్రియాంకా మోహన్‌ ఇందులో హీరోయిన్‌గా నటించింది‌.

‘డాన్‌’ థియేట్రికల్‌ రైట్స్‌ ఎవరికంటే..!

కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్‌ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌ శిబి చక్రవర్తి దర్శకత్వంలో నిర్మించిన తాజా చిత్రం ‘డాన్‌’. ప్రియాంకా మోహన్‌ ఇందులో హీరోయిన్‌గా నటించింది‌. ఎస్‌.జె.సూర్య, సముద్రఖని, సూరి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. వచ్చే నెల 13వ తేదీన విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ‘డాన్‌’ సినిమా థియేట్రికల్‌ రైట్స్‌ను హీరో, ఎమ్మెల్యే ఉదయనిధికి చెందిన రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా.. ఉదయనిధిని లైకా ప్రొడక్షన్‌ చీఫ్‌ మేనేజింగ్‌ హెడ్‌ జీకేఎం తమిళ్‌ కుమరన్‌, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సహ నిర్మాత ఎం.షణ్ముగమూర్తి, శివకార్తికేయన్‌ ప్రొడక్షన్‌ సహ నిర్మాత కలైయరసు తదితరులు అభినందించారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలకు మంచి ఆదరణ లభించింది. 

Updated Date - 2022-04-08T19:19:23+05:30 IST

Read more