త్వరలో culcutta I'm sorry సినిమా

ABN , First Publish Date - 2022-06-19T20:46:02+05:30 IST

ఆంగ్లోస్‌ ఇన్‌ ది విండ్‌ (Anglos in the Wind) తో కలిసి పేపర్‌ వాచర్ ప్రొడక్షన్‌ (Paper Watcher Production) నిర్మించిన హాలీవుడ్‌ చిత్రం ‘కోల్‌కత్తా ఐ యామ్‌ సారీ’ (Culcutta I'm Sorry). హ్యారీ మెక్లర్‌ (Harry Mc cler) దర్శకుడు. ఈ సినిమాను కున్నూరు, చెన్నై, కోల్‌కత్తా వంటి ప్రాంతాల్లో తెరకెక్కించారు.

త్వరలో culcutta I'm sorry సినిమా

ఆంగ్లోస్‌ ఇన్‌ ది విండ్‌ (Anglos in the Wind) తో కలిసి పేపర్‌ వాచర్ ప్రొడక్షన్‌ (Paper Watcher Production) నిర్మించిన హాలీవుడ్‌ చిత్రం ‘కోల్‌కత్తా ఐ యామ్‌ సారీ’ (Culcutta I'm Sorry). హ్యారీ మెక్లర్‌ (Harry Mc cler) దర్శకుడు. ఈ సినిమాను కున్నూరు, చెన్నై, కోల్‌కత్తా వంటి ప్రాంతాల్లో తెరకెక్కించారు. తల్లి, కుమార్తె, మనవరాలు ఇలా మూడు తరాలకు ఇతివృత్తంతో వారి మధ్య శారీరకంగా, మానసికంగా ఉండే భావోద్వేగాలను చూపిస్తూ తెరకెక్కించారు. ప్రిస్కిల్లా కార్నర్ (Priscilla Corner) ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 


ఈ చిత్ర కథను పరిశీలిస్తే, నీలగిరి జిల్లా కున్నూరులో ఉపాధ్యాయురాలిగా పనిచేసే అమండా అనే ఒక ఆంగ్లో ఇండియన్‌ మహిళ దీర్ఘకాలపు వ్యాధికి గురైన విషయాన్ని తెలుసుకుంటుంది. దీంతో మనస్పర్థల కారణంగా తన నుంచి దూరమై చెన్నైలో ఉంటున్న తల్లి, కుమార్తెలను కలుసుకోవడానికి సైకిల్‌పై 547 కిలోమీటర్ల దూరంలో ఉండే చెన్నైకి బయలుదేరుతుంది. అక్కడికి చేరుకున్న తర్వాత వారు కోల్‌కత్తాకు వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఎలాగైనా తన తల్లి, కుమార్తెను కలుసుకోవాలన్న పట్టుదలతో చెన్నైనుంచి 1,670 కిలోమీటర్ల దూరంలోని కోల్‌కత్తాకు సైకిల్‌పై సాహసయాత్ర చేపడుతుంది. అంతిమంగా ఆమె తన కలను సాకారం చేసుకుందా? సైకిల్‌ అడ్వెంచర్‌లో ఆమె ఎదుర్కొన్న సమస్యలు తదితర అంశాలను భావోద్వేగంతో ఆసక్తికరంగా తెరకెక్కించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమాకు ఎడిటర్‌గా, కెమెరామెన్‌గా నికోలస్‌ మోసెస్‌ (Nicolas Mozes), సంగీతం గణేష్‌ రమణ (Ganesh Ramana) సమకూర్చారు.

Updated Date - 2022-06-19T20:46:02+05:30 IST

Read more