ఆ వేడుకకు అందరికీ ఆహ్వానం పలికిన చిరు
ABN , First Publish Date - 2022-03-23T05:06:56+05:30 IST
భారతదేశంలో మూడేళ్లకోసారి ఒక్కో రాష్ట్రంలో నిర్వహించే సాంస్కృతిక మహోత్సవాన్ని ఈసారి భారత ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. మార్చి 26, 27 తేదీల్లో రాజమండ్రిలో.. 29, 30 తేదీల్లో వరంగల్లో.. ఏప్రిల్ 1 నుండి 3వ తేదీ వరకు హైదరాబాద్లో

భారతదేశంలో మూడేళ్లకోసారి ఒక్కో రాష్ట్రంలో నిర్వహించే సాంస్కృతిక మహోత్సవాన్ని ఈసారి భారత ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. మార్చి 26, 27 తేదీల్లో రాజమండ్రిలో.. 29, 30 తేదీల్లో వరంగల్లో.. ఏప్రిల్ 1 నుండి 3వ తేదీ వరకు హైదరాబాద్లో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. మన సంస్కృతిని ప్రతిబింబించేలా జరిగే ఈ సాంస్కృతిక మహోత్సవాలకు ప్రతి ఒక్కరూ రావాలని ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు.
‘‘భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పే దేశం మన భారతదేశం. ఆ మహోన్నత సంస్కృతిని ప్రతిబింబించేలా జాతీయ సాంస్కృతిక మహోత్సవాలను భారత ప్రభుత్వం ఈసారి మన తెలుగు రాష్ట్రాలలో నిర్వహిస్తుండటం మనందరికీ గర్వకారణం. మనదేశ గణ వారసత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే వివిధ సాంస్కృతిక కళా రూపాలను ఎందరో కళాకారులు.. రాజమహేంద్రవరంలో మార్చి 26, 27 తేదీలలో, అలాగే వరంగల్లో మార్చి 29, 30 తేదీలలో.. హైదరాబాద్లో ఏప్రిల్ 01, 02, 03 తేదీలలో ప్రదర్శిస్తారు. మన మహోజ్వల చారిత్రక సాంస్కృతిక కళా మహోత్సవాలను తిలకిద్దాం.. దానిని విజయవంతం చేద్దాం. మన సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకుపోవడంలో మనందరం భాగస్వాములం అవుదాం. రండి.. జైహింద్’’ అంటూ మెగాస్టార్ చిరంజీవి ఈ వీడియో ద్వారా అందరికీ ఆహ్వానం పలికారు.