నగ్నంగా ఎందుకు నటించానంటే ! : Brigida Saga
ABN , First Publish Date - 2022-07-17T20:23:38+05:30 IST
కోలీవుడ్ విలక్షణ నటుడు, వైవిధ్య చిత్రాల దర్శకుడు పార్తిబన్ (Parthiban). ఆయన తాజాగా నటించి, దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘ఇరవిన్ నిళల్’ (Iravin Nizhal) (రాత్రి నీడ). ఈ నెల 15న చిత్రం విడుదలైంది.

కోలీవుడ్ విలక్షణ నటుడు, వైవిధ్య చిత్రాల దర్శకుడు పార్తిబన్ (Parthiban). ఆయన తాజాగా నటించి, దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘ఇరవిన్ నిళల్’ (Iravin Nizhal) (రాత్రి నీడ). ఈ నెల 15న చిత్రం విడుదలైంది. వరలక్ష్మి శరత్ కుమార్, రోబో శంకర్, ప్రియాంకా రుత్, బ్రిగిడ సాగా, ఆనంద కృష్ణన్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే.. ఇది సింగిల్ షాట్‌లోనే చిత్రీకరించిన చిత్రం. మొట్టమొదటి నాన్ లీయర్ సింగిల్ షాట్ ఫిల్మ్‌గా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఇందులో చిలకమ్మ అనే పాత్ర పోషించిన బ్రిగిడ సాగా (Brigida saga) అనే అమ్మాయి.. నగ్నంగా నటించడం గమనార్హం. ఇందులోని తన పాత్ర గురించి బ్రిగిడ చాలా ఆసక్తికరమైన విశేషాలు తెలిపింది.
అసిస్టెంట్ డైరెక్టరుగా ఉన్న తనను ఒక హీరోయిన్‌ను చేసిన క్రెడిట్ దర్శకుడు, హీరో ఆర్.పార్తీబన్‌కే దక్కుతుందని, ఆయన కోరిక మేరకే తాను ‘ఇరవిన్ నిళల్’ చిత్రంలో ఒక సన్నివేశంలో నగ్నంగా నటించినట్టు బ్రిగిడ వెల్లడించింది. ‘ఇరవిన్ నిళల్’ చిత్రంలో ఈమె పాత్రను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ముఖ్యంగా న్యూడ్ సీన్‌ను బ్రిగిడ ధైర్యంగా చేసిందంటూ మెచ్చుకుంటున్నారు. దీనిపై తాజాగా ఆమె మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో సహాయ దర్శకురాలిగా పని చేసేందుకు వెళ్ళిన నన్ను హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు. సినిమాకు ఒక న్యూడ్ సీన్ అవసరమవుతుందని, అది సినిమాను ప్రేమించే వారే కావాలని చెప్పడంతో అంగీకరించాను. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి వారి నుంచి ఎలా అనుమతి తీసుకోవాలన్న సంకటస్థితిని ఎదుర్కొన్నాను. ఆ తర్వాత పార్తీబన్, నేను కలిసి మా తల్లిదండ్రులకు వివరించాం. వారు ఒకే చెప్పారు. అయితే, ఈ సన్నివేశంలో అనేక టెక్నికల్ విషయాలున్నాయి. కానీ, సినిమాలో చూసే సమయంలో అది నిజంగానే న్యూడ్ సీన్‌గా కనిపిస్తుంది’ అని వివరించారు.