నేను గే కాదు... కానీ, ‘ఆయన’ అందం చూసి పడిపోయానంటోన్న ‘అతడు’...
ABN , First Publish Date - 2022-02-04T00:43:35+05:30 IST
బ్రాడ్ పిట్కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులుంటారని మనకు తెలియంది కాదు. అయితే, అంతర్జాతీయ అందగాడైన పిట్కి అమ్మాయిల ఫాలోయింగ్ మరింత ఎక్కువ. అతడంటే దేశదేశాల ఆడపిల్లలు పడి చచ్చిపోతుంటారు. కానీ, తాజాగా ఓ మేల్ యాక్టర్ హాలీవుడ్ సూపర్ స్టార్ రూపం గురించి, సౌందర్యం గురించి ‘ఆహా, ఓహో‘ అంటూ చెప్పుకొచ్చాడు.

బ్రాడ్ పిట్ది ‘కనురెప్ప వాల్చనీయని అందం’ అంటున్నాడు హాలీవుడ్ నటుడు బ్రియాన్ కాక్స్! ‘ట్రాయ్’ సినిమాలో పిట్తో కలసి అతను నటించాడు. బ్రాడ్ షూటింగ్ కోసం సెట్ మీదకి రాగానే... బ్రియాన్ కాక్స్ నోరు తెరిచి అలా చూస్తుండిపోయాడట. అంతటి అద్భుత అందగాడు పిట్ అంటూ కీర్తిస్తున్నాడు బ్రియాన్. అంతే కాదు, ‘‘నేను స్ట్రెయిట్... ’’ అంటూ క్లారిటీ కూడా ఇస్తున్నాడు. తాను ‘గే’ కాదని నొక్కి చెబుతూనే ‘‘మై గాడ్, దిస్ గై ఈజ్ స్టన్నింగ్...’’ అని ఎగ్జైట్ అయిపోయాడు! బ్రాడ్ పిట్తో స్క్రీన్ షేర్ చేసుకోవటం నిజంగా అదృష్టం అని బ్రియాన్ కాక్స్ కామెంట్ చేశాడు...