భరత్‌ సరసన వాణీభోజన్‌..

ABN , First Publish Date - 2022-03-17T18:59:41+05:30 IST

ప్రేమిస్తే, బాయ్స్, యువసేన లాంటి చిత్రాలలో నటించి తన సహజనటనతో అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరో భరత్‌ ఇపుడు తన 50వ చిత్రంలో నటిస్తున్నారు.

భరత్‌ సరసన వాణీభోజన్‌..

ప్రేమిస్తే, బాయ్స్, యువసేన లాంటి చిత్రాలలో నటించి తన సహజనటనతో అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరో భరత్‌ ఇపుడు తన 50వ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా వాణీ భోజన్‌ను ఎంపికచేశారు. ఈ చిత్రం పూజా కార్యక్రమం బుధవారం చెన్నైలో జరుగగా, ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్‌.థాను ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. థ్రిల్లర్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ సినిమాను ఆర్‌.పి.ఫిలిమ్స్‌ పతాకంపై నిర్మాత ఆర్‌.పి.బాలా, కౌసల్య బాలా నిర్మిస్తున్నారు. ఇందులో వివేక్‌ ప్రసన్న, బిగ్‌బాస్‌ ఫేం డోనీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘లూసిఫర్‌’, ‘మరైక్కాయార్‌’, ‘కురుప్‌’ వంటి పలు చిత్రాలకు తమిళంలో మాటలు, పాటలు సమకూర్చిన ఆర్‌.పి.బాలా ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ పీజీ ముత్తయ్య చాయాగ్రహణం సమకూర్చుతుండగా, రన్నీ రఫేల్‌ సంగీతం సమకూర్చుతున్నారు. 

Updated Date - 2022-03-17T18:59:41+05:30 IST

Read more