సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బెంగాలీ నటులను స్మరించుకుంటూ యాడ్‌ను రూపొందించిన Amul

ABN, First Publish Date - 2022-05-25T22:22:22+05:30

బెంగాలీ నటులు సౌమిత్రా చటర్జీ(Soumitra Chatterjee), స్వాతిలేఖ సేన్‌గుప్తా (Swatilekha Sengupta) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బేలాషురు’ (BelaShuru). ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా మే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగాలీ నటులు సౌమిత్రా చటర్జీ(Soumitra Chatterjee), స్వాతిలేఖ సేన్‌గుప్తా (Swatilekha Sengupta) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బేలాషురు’ (BelaShuru). ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా మే 20న విడుదలైంది. ఈ మూవీ విడుదల కాకముందే ఇందులో కీలక పాత్రల్లో కనిపించిన సౌమిత్ర, స్వాతిలేఖ మృతి చెందారు. ఈ నేపథ్యంలో పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ (Amul) వారికీ నివాళులు అర్పించింది. ఓ యాడ్‌ను రూపొందించింది. ‘‘బేల ఎప్పటికీ ముగియదు. రుచి ఇప్పుడే మొదలవుతుంది’’ అంటూ క్రియేటివ్‌ యాడ్‌ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ యాడ్‌లో.. స్వాతిలేఖ జుత్తును సౌమిత్ర దువ్వెనతో దువ్వుతుంటారు. అమూల్ బేబీ పట్టుకున్న అద్దంలో స్వాతిలేఖ ముఖాన్ని చూసుకుంటుంటారు. యాడ్ కింద అమూల్ సంస్థ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘‘భారతీయ సినిమాలోనే మొదటిసారిగా చిత్రంలోని ముఖ్య పాత్రధారులు విడుదలకు ముందే మరణించారు’’ అని ఆ సంస్థ తెలిపింది. 


అమూల్ రూపొందించిన యాడ్‌కు నెటిజన్స్ ఫిదా అయ్యారు. ‘‘వెటరన్ నటులకు నివాళి అర్పించినందుకు థ్యాంక్స్’’ అంటూ సోషల్ మీడియా యూజర్స్ కామెంట్స్ పోస్ట్ చేశారు. సౌమిత్రా చటర్జీకీ 85ఏళ్ల వయసులో కరోనా సోకింది. కోవిడ్‌తో 40రోజులు పోరాటం చేసిన అనంతరం నవంబర్ 15 2020న ఆయన మరణించారు. స్వాతిలేఖ సేన్‌గుప్తా కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతూ గతేడాది జూన్ 16న మృతి చెందారు. ‘బేలా‌షురు’ని విండోస్ ప్రొడక్షన్స్ నిర్మించింది. అన్ని తరాల ప్రేమ కథను... జీవితంలోని వివిధ దశల్లో ఏలా ఉంటుందో ‘బేలా‌షురు’లో చూపిస్తామని నిర్మాణసంస్థ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.



Updated Date - 2022-05-25T22:22:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!