'బీస్ట్': సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది..

ABN , First Publish Date - 2022-03-17T15:13:12+05:30 IST

కోలీవుడ్ స్టార్ హీరో 'తలపతి విజయ్, మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజాహెగ్డే జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'బీస్ట్'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది.

'బీస్ట్': సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది..

కోలీవుడ్ స్టార్ హీరో 'తలపతి విజయ్, మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజాహెగ్డే జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'బీస్ట్'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. ఇటీవలే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ 'అరబిక్ కుత్తు' పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబడుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు సెకండ్ సింగిల్ రాబోతోంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.


ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్ సెకండ్ సింగిల్ 'జాలీ ఓ జింఖానా'.. అంటూ సాగే ఫుల్ సాంగ్‌ను మార్చి 19న విడుదల చేయబోతున్నట్టు తాజాగా వెల్లడించారు. అయితే, ఈ పాటను హీరో విజయ్ పాడడం విశేషం. కాగా, ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.  Updated Date - 2022-03-17T15:13:12+05:30 IST

Read more