సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Beast: ట్రెండింగ్‌లో సెకండ్ సింగిల్..

ABN, First Publish Date - 2022-03-20T14:15:39+05:30

తమిళ స్టార్ హీరో విజయ్, పూజాహెగ్డే జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'బీస్ట్'. ఈ మూవీ నుంచి తాజాగా సెకండ్ సింగిల్ వచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీని ప్రముఖ నిర్మాణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళ స్టార్ హీరో విజయ్, పూజాహెగ్డే జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'బీస్ట్'. ఈ మూవీ నుంచి తాజాగా సెకండ్ సింగిల్ వచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు రెడీ అవున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఈ చిత్రం నుంచి ఇప్పటికే వాలంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ సింగిల్ 'అరబిక్ కుతు' సాంగ్‌కి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.


ఇక తాజాగా ఈ సినిమా నుంచి నుంచి సెకండ్ సాంగ్‌ను కూడా వదిలారు. 'జాలీ ఓ జింఖానా' అంటూ సాగే ఈ సాంగ్‌లో విజయ్, పూజాహెగ్ధే స్టెప్పులు అఆకట్టుకుంటున్నాయి. ఈ పాటను హీరో విజయ్ పాడడం విశేషం. ఈ పాటకి కు.కార్తిక్ లిరిక్స్ అందించగా, అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఫస్ట్ సింగిల్ ఇంకా యూట్యూబ్‌లో వ్యూస్ రాబడుతూ ట్రెండ్ అవుతోంది. మరి తాజాగా వచ్చిన ఈ సెకండ్ సింగిల్ ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. 



Updated Date - 2022-03-20T14:15:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!