కోలీవుడ్‌లో మొదలైన ‘బీస్ట్‌’ మ్యానియా

ABN , First Publish Date - 2022-04-08T19:18:45+05:30 IST

నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో స్టార్‌ హీరో విజయ్‌ నటించిన ‘బీస్ట్‌’ చిత్రం ఈ నెల 13న విడుదలకానుంది. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మించారు. ‘రా’ విభాగంలో పనిచేసే వీర రాఘవన్‌ అనే సోల్జర్‌ పాత్రలో విజయ్‌ నటించారు. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్‌ను రిలీజ్‌ చేయగా, అనేక విమర్శలు వచ్చాయి. గతంలో హాస్య నటుడు యోగిబాబు నటించిన ‘గూర్ఖా’ మూవీ కాపీకొట్టారంటూ నెటిజన్లు పెదవి విరిచారు. అయితే, ఈ ట్రైలర్‌కు వచ్చిన టాక్‌తో పనిలేకుండా విజయ్‌ ఫ్యాన్స్‌ ఈ సినిమా మొదటి ఆట కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ప్రారంభమైన  టిక్కెట్ల అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కోసం పోటీపడుతున్నారు. దీంతో టిక్కెట్‌ రేటు వెయ్యి రూపాయల నుంచి రూ.3 వరకు పలుకుతోంది. కొళత్తూరులోని యమునా థియేటర్‌లో 13వ తేదీ ఉదయం 4 గంటలకు ప్రదర్శించనున్న ప్రత్యేక షో టిక్కెట్‌ ధర రూ.1000గా నిర్ణయించారు. మరికొన్ని థియేటర్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ‘డాక్టర్’ సినిమాతో ఇటీవల సూపర్ హిట్ అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్, ‘మాస్టర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన విజయ్ కాంబోలో వస్తున్న తొలి చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అదే రోజు తెలుగులో కూడా విడుదల కానుంది. మరి బీస్ట్‌గా విజయ్ ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటాడో చూడాలి. 

Updated Date - 2022-04-08T19:18:45+05:30 IST

Read more