Gopi Sundar తో నేపథ్యగాయని అమృత వివాహం?
ABN , First Publish Date - 2022-08-07T15:45:52+05:30 IST
కోలీవుడ్ నేపథ్య గాయని, నటుడు బాలా మాజీ భార్య అమృత సురేష్ (Amrutha Suresh) మలయాళ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు గోపీసుందర్ (Music Director Gopi Sundar)ను పెళ్ళి చేసుకున్నట్టు తెలుస్తోంది.
కోలీవుడ్ నేపథ్య గాయని, నటుడు బాలా మాజీ భార్య అమృత సురేష్ (Amrutha Suresh) మలయాళ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు గోపీసుందర్ (Music Director Gopi Sundar)ను పెళ్ళి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వార్తలను నిజం చేసేలా వారిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను అమృత సురేష్ తన ఇన్‌స్టాఖాతాలో షేర్ చేశారు. ఈ ఫొటోల కింద ఆమె పెట్టిన క్యాప్షన్‌లో గోపీ సుందరే నా భర్త అని పేర్కొన్నారు. 2010లో టెలికాస్ట్ అయిన ఒక రియాలిటీ షోలో ఒక కంటెస్టెంట్‌గా అమృత సురేష్ పాల్గొన్నారు.
దీనికి నటుడు బాలా న్యాయనిర్ణేతగా ఉన్నారు. ఆ సమయంలో వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నారు. కొంతకాలానికి విడిపోయారు. అలాగే, గోపీసుందర్ కూడా ప్రియ అనే యువతిని పెళ్ళి చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గోపీసుందర్ సంగీత దర్శకత్వంలో అమృత పాటలు పాడారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్ళి చేసుకున్నట్టు సమాచారం. ఇటీవల అమృత సురేష్ తన పుట్టినరోజును తన సోదరితో పాటు గోపీసుందర్‌తో కలిసి జరుపుకొన్నారు. ఆ సమయంలో వారి ఎంతో సన్నిహితంగా మెలుగుతూ దిగిన ఫొటోలను అమృత తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.