ఈ యువతి పేరు Divya.. సినీ కుటుంబమే అయినా డిఫరెంట్ కెరీర్‌తో యమా పాపులర్.. ఏ నటుడి కూతురో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-06-19T01:07:48+05:30 IST

నటీ, నటుల వారసులు సినిమాల్లోనే రాణిస్తుంటారు. కానీ, కొందరు మాత్రం భిన్నమైన దారిలో ప్రయాణిస్తుంటారు. అలా సినీ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఓ నటుడి కూతురు డిఫరెంట్ కెరీర్‌ను

ఈ యువతి పేరు Divya.. సినీ కుటుంబమే అయినా డిఫరెంట్ కెరీర్‌తో యమా పాపులర్.. ఏ నటుడి కూతురో తెలిస్తే..

నటీ, నటుల వారసులు సినిమాల్లోనే రాణిస్తుంటారు. కానీ, కొందరు మాత్రం భిన్నమైన దారిలో ప్రయాణిస్తుంటారు. అలా సినీ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఓ నటుడి కూతురు డిఫరెంట్ కెరీర్‌ను ఎంచుకుంది. ఆమే దివ్య సత్యరాజ్ (Divya Sathyaraj). సత్యరాజ్ (Sathyaraj) కూతురు, శిబి సోదరే ఈ దివ్యరాజ్. తండ్రి సినిమాల్లో రాణిస్తుంటే ఆమె మాత్రం న్యూట్రిషన్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. ‘ద అక్షయ పాత్ర పౌండేషన్’ (The Akshaya Patra Foundation)కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది. ఆమె 2020లో ‘మహిల్మది ఇయక్కం’ మూవ్‌మెంట్‌ను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా వెనుకబడిన వర్గాల వారికీ పోషకాలతో కూడిన ఆహారాన్ని ఉచితంగా అందిస్తుంది.  


దివ్య సత్యరాజ్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. ఎల్లప్పుడు ఫొటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఆ పిక్స్ కింద ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు ఇస్తుంది. బాడీ పాజిటివిటికి సంబంధించిన ఆలోచనలను అందరితో పంచుకుంటుంది. దివ్య ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్‌ను గమనిస్తే..‘‘నేను వేసవికాలంలో ఎప్పుడు బరువు పెరుగుతుంటాను. ఎందుకంటే మామిడికాయలు తినడమంటే నాకు చాలా ఇష్టం. ఈ సారి నేను 52కిలోల నుంచి 56కిలోలకు పెరిగాను. కానీ, నేను ఎలాంటి ఒత్తిడికి గురికావడం లేదు. నేను ఆరోగ్యకరమైన ఆహారం తిని, తప్పనిసరిగా వ్యాయామాలు చేస్తాను. నా చెంపలు బొద్దుగా ఉన్నప్పటికి నేను సంతోషంగా ఉన్నాను. సంతోషం అనేది శరీర పరిమాణంలో లేదు. బరువు అనేది ఎప్పుడు మీ విలువను కొలవదని నేను న్యూట్రిషనిస్ట్‌గా నా రోగులకు చెబుతుంటాను’’ అని దివ్య సత్యరాజ్ కామెంట్ చేసింది.Updated Date - 2022-06-19T01:07:48+05:30 IST

Read more