సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Avatar 2 Early Twitter review: హాలీవుడ్ జనాలు ఏమంటున్నారంటే..

ABN, First Publish Date - 2022-12-07T19:27:19+05:30

అవతార్ (Avatar).. 2009లో విడుదలైన ఈ చిత్రం సృష్టించిన రికార్డులు అందరికీ తెలిసిందే. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవతార్ (Avatar).. 2009లో విడుదలైన ఈ చిత్రం సృష్టించిన రికార్డులు అందరికీ తెలిసిందే. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ (James Cameron) దర్శకత్వం వహించిన ఈ మూవీ  ప్రపంచవ్యాప్తంగా రూ.23 వేల కోట్లకి పైగా వసూళ్లని సాధించింది. అప్పట్లోనే ఈ సినిమా పలు సీక్వెల్స్ తీస్తానని కామెరూన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ సీక్వెల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సినీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణ ఫలిస్తూ ఎట్టకేలకు డిసెంబర్ 16న ‘అవతార్ 2’ విడుదల కానుంది. (Avatar 2 Early Twitter review)


అయితే.. ఇప్పటికే అమెరికాలోని పలు చోట్ల ప్రముఖుల కోసం ఈ చిత్ర ప్రీమియర్స్ షోస్‌ని వేశారు. దీంతో ఈ సినిమాని ఇప్పటికే చూసేసిన పలువురు నెటిజన్లు ట్విట్టర్‌లో మూవీ గురించి తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. అందులో.. ‘నేను ఇప్పటివరకు చూడని అత్యంత అద్భుతమైనా వీఎఫ్‌ఎక్స్‌తో అవతార్: ది వే ఆఫ్ వాటర్ (Avatar The Way of Water) ఉత్కంఠభరితంగా, అందంగా ఉంది. కథనం మొదటిదాని కంటే బలహీనంగా ఉంది.  కానీ చూడటానికి ఎల్లప్పుడూ చాలా బాగుంది. అలాగే చివరి గంట అద్భుతంగా ఉంది’ అని ఒకరు రాసుకొచ్చారు.


‘జేమ్స్ కామెరాన్ మరో గ్రహం మీద ఈ చిత్రాన్ని తీశాడని నేను దాదాపు నమ్మేశాను. మూవీ అద్భుతంగా ఉంది. లెంత్ ఎక్కువగా ఉన్నా.. నన్ను లీనమై చూసేలా చేసింది. 13 సంవత్సరాల క్రితం వచ్చిన అవతార్ లాగా.. ఈ చిత్రం కూడా ఒక సినిమాటిక్ అద్భుతం. తప్పక చూడాల్సిన చిత్రం’ అని ఇంకొకరు రాసుకొచ్చారు. మరొకరైతే మరిన్నీ ‘అవతార్’ సినిమాలు చూడాలని ఉందని ట్వీట్ చేశారు.









Updated Date - 2022-12-07T19:27:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!