Arya- Muthaiah: ముత్తయ్య దర్శకత్వంలో ఆర్య?
ABN , First Publish Date - 2022-05-03T02:40:04+05:30 IST
ప్రముఖ దర్శకుడు ముత్తయ్య (Muthaiah) దర్శకత్వంలో హీరో ఆర్య (Arya) ఒక చిత్రంలో నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ముత్తయ్య దర్శకత్వంలో
ప్రముఖ దర్శకుడు ముత్తయ్య (Muthaiah) దర్శకత్వంలో హీరో ఆర్య (Arya) ఒక చిత్రంలో నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ముత్తయ్య దర్శకత్వంలో కార్తీ (Karthi), అదితి శంకర్ (Aditi Shankar) జంటగా.. ప్రకాష్ రాజ్, రాజ్‌కిరణ్, సూరి తదితరులు నటిస్తున్న ‘విరుమన్’ (Viruman) అనే చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, చివరిదశకు చేరుకుంది. ఇది పూర్తికాగానే ఆర్య చిత్రానికి ముత్తయ్య దర్శకత్వం వహించనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఆగస్టు నుంచి సెట్స్‌పైకి వెళ్ళే ఈ చిత్రం కూడా ముత్తయ్యకు అత్యంత ప్రీతిపాత్రమైన గ్రామీణ నేపథ్యంలోనే ఉంటుందని సమాచారం. గతంలో ఒకటి రెండు గ్రామీణ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన చిత్రాల్లో ఆర్య నటించినప్పటికీ ఇందులో మాత్రం ఆయన పూర్తిస్థాయి గ్రామీణ పాత్రలో నటించనున్నారని కోలీవుడ్ (Kollywood) వర్గాల సమాచారం.