ArunVijay : ఆసక్తికరంగా ‘యానై’ ట్రైలర్
ABN, First Publish Date - 2022-06-02T18:06:04+05:30
ప్రముఖ తమిళ నటుడు విజయ్ కుమార్ (Vijay Kumar) తనయుడు అరుణ్ విజయ్ (Arun Vijay). హీరోగా తన కెరీర్ ను ప్రారంభించి .. విలన్ గా టర్న్ అయిన అరుణ్.. ఇప్పుడు సక్సెస్ ఫుల్ హీరోగా నిలదొక్కుకున్నాడు. ప్రస్తుతం తమిళంలో హీరోగా వరుస చిత్రాలు చేస్తున్నాడు. వాటిలో ‘యానై’ (Yaanai) (ఏనుగు) ఒకటి. మాస్ దర్శకుడు హరి (Hari) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో పక్కా యాక్షన్ చిత్రంగా రూపొందుతోంది.
ప్రముఖ తమిళ నటుడు విజయ్ కుమార్ (Vijay Kumar) తనయుడు అరుణ్ విజయ్ (Arun Vijay) అన్న సంగతి తెలిసిందే. హీరోగా తన కెరీర్ ను ప్రారంభించి .. విలన్ గా టర్న్ అయిన అరుణ్.. ఇప్పుడు సక్సెస్ ఫుల్ హీరోగా నిలదొక్కుకున్నాడు. ప్రస్తుతం తమిళంలో హీరోగా వరుస చిత్రాలు చేస్తున్నాడు. వాటిలో ‘యానై’ (Yaanai) (ఏనుగు) ఒకటి. మాస్ దర్శకుడు హరి (Hari) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో పక్కా యాక్షన్ చిత్రంగా రూపొందుతోంది. ‘సింగం సిరీస్, ఆరు, పూజ, స్వామి 2’ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హరి దర్శకత్వంలో తొలిసారిగా విజయ్ నటించిన ఈ సినిమాను జూన్ 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ ను రీసెంట్‌గా విడుదల చేశారు. దీనికి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
‘యానై’ మూవీ ఆడియో, ట్రైలర్ రిలీజ్ వేడుక రీసెంట్ గా చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా హీరో అరుణ్ విజయ్ మాట్లాడుతూ.. ‘సుధీర్ఘకాలంగా అనుకుంటూ వచ్చిన ప్రాజెక్టు ఇప్పటికి కార్యరూపం దాల్చింది. యానై అంటే బలం. ఇలాంటి సినిమా తీయాలంటే గొప్ప కాన్ఫిడెన్స్ కావాలి. చాలాకాలం తర్వాత ఓ పల్లెటూరి పాత్రలో నటించాను. నా పాత్రను తీర్చిదిద్దడంలో దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇందులోని యాక్షన్ సన్నివేశాలు ఎంతో ఛాలెంజింగ్‌తో ఉన్నాయి. పలుమార్లు గాయపడ్డాను కూడా. తన రొటీన్ ఫార్ములా నుంచి తప్పుకొని సరికొత్త జానర్‌లో తెరకెక్కించారు’.. అని అన్నారు.
దర్శకుడు హరి మాట్లాడుతూ.. ‘నేను, అరుణ్ కలిసి పనిచేయాలన్నది చాలా రోజుల కల. ఇది ఇప్పటికి ఫలించింది. గడిచిన మూడేళ్ళలో అనేక పాఠాలు నేర్చుకున్నాను. అనేక మంది దర్శకుల నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ తో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది’ అని అన్నారు. ప్రియా భవానీ శంకర్(Priya Bhavanishankar) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని డ్రమ్‌స్టిక్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మాత వేదిక్కారన్‌పట్టి ఎస్.శక్తివేల్ నిర్మించారు. ఈ చిత్రంలో అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, యోగిబాబు, అమ్ము అభిరామి, కీజీఎఫ్ రామచంద్ర రాజు, రాధిక, ఇమ్మాన్ అన్నాచ్చి, రాజేష్, ఐశ్వర్య, బోస్ వెంకట్, సంజీవ్, పుగళ్ తదితరులు నటించారు. ఇదే సినిమాను తెలుగులో ‘ఏనుగు’ (Yenugu) పేరుతో విడుదల చేయబోతున్నారు. మరి ‘యానై’ చిత్రంతో అరుణ్ విజయ్ ఏ స్థాయిలో పేరు తెచ్చుకుంటాడో చూడాలి.