సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Breaking news: సినీ నటుడు నాజర్‌కు గాయాలు

ABN, First Publish Date - 2022-08-17T23:54:25+05:30

తెలుగు, తమిళ సినిమాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా ఫేమ్ సంపాదించుకున్న నటుడు నాజర్(Nassar). ఓ తమిళ సినిమా షూటింగ్‌ చేస్తుండగా తాజాగా ఆయన గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. నాజర్ తాజాగా ఓ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు, తమిళ సినిమాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా ఫేమ్ సంపాదించుకున్న నటుడు నాజర్(Nassar). ఓ తమిళ సినిమా షూటింగ్‌ చేస్తుండగా తాజాగా ఆయన గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. నాజర్ ఓ తమిళ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పోలీస్ అకాడమీలో జరుగుతుంది. ఆ సమయంలో మెట్లపై నుంచి దిగుతుండగా ఆయన జారిపడ్డారు. ఫలితంగా గాయాల పాలయ్యారు. దీంతో చిత్ర బృందం సత్వరమే స్పందించి సమీపంలోని ఆస్పత్రికి తరలించింది. వైద్యులు సాధారణ గాయమే అని తెలపడంతో చిత్రబృందం ఊపిరి పీల్చుకుంది. ఈ సినిమా షూటింగ్‌లో సుహాసిని, మెహ్రీన్ కౌర్, షాయాజీ షిండే తదితరులు పాల్గొంటున్నారు. యస్‌యస్.రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన ‘బాహుబలి’ తో నాజర్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. 


Updated Date - 2022-08-17T23:54:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!