సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మరో రెండ్రోజుల్లోనే పెళ్లి.. ఈ లోపే Nayanthara-Vignesh Shivan వివాహానికి సంబంధించి మరో న్యూస్..!

ABN, First Publish Date - 2022-06-07T21:04:13+05:30

తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార, చిత్ర దర్శకుడు, నిర్మాత విఘ్నేశ్ శివన్‌ జూన్ 9న వివాహం జరగబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార, చిత్ర దర్శకుడు, నిర్మాత విఘ్నేశ్ శివన్‌ జూన్ 9న వివాహం జరగబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. 2021లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఇంతవరకూ పెళ్లిపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఎక్కడా మ్యారేజ్ గురించి మాట్లాడలేదు. అయితే.. జూన్ 7న ప్రెస్ మీట్‌లో ఈ కపుల్ తమ వివాహ తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఈ జంట గురించి మరో క్రేజీ వార్త ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది.


నయన్, విఘ్నేశ్ తమ వివాహ వీడియో హక్కులను స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌కు భారీ మొత్తానికి విక్రయించినట్లు సమాచారం. ప్రముఖ చిత్రనిర్మాత గౌతమ్ మీనన్ (Gautham Menon) ఈ వివాహ వేడుకని డాక్యుమెంటరీ శైలిలో చిత్రీకరిస్తారని నివేదిక పేర్కొంది. మహాబలిపురంలోని రిసార్ట్‌లో జరిగే ఈ స్టార్ కపుల్ వివాహానికి దక్షిణ భారత సినీ పరిశ్రమకు చెందిన విజయ్ సేతుపతి, రజనీకాంత్, చిరంజీవి, కమల్ హాసన్, సూర్య వంటి ఇతర ప్రముఖులు అతిథులుగా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత అదే రోజు సాయంత్రం అతిథుల కోసం గ్రాండ్ పార్టీని నిర్వహించనున్నట్లు వినికిడి. అయితే.. నయనతార, విఘ్నేశ్ ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ (MK Stalin)ని వివాహానికి ఆహ్వానించారు. ఆ సమయంలో సీఎం కుమారుడు, నటుడు, సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్నారు.

Updated Date - 2022-06-07T21:04:13+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!