దుబాయ్‌లో ‘పొన్నియిన్ సెల్వన్’ మ్యూజిక్ కంపోజిషన్.. రెహమాన్ ఏమన్నాడంటే..
ABN , First Publish Date - 2022-03-24T15:16:14+05:30 IST
దేశంలోని టాలెంటెడ్ డైరెక్టర్స్‌లో మణిరత్నం ఒకరు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే ఈ దర్శకుడు..

దేశంలోని టాలెంటెడ్ డైరెక్టర్స్‌లో మణిరత్నం ఒకరు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే ఈ దర్శకుడు ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకులని అలరించాడు. ఈ స్టార్ డైరెక్టర్ తాజాగా తెరకెక్కిస్తున్న మరో భారీ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ ఈ ఏడాది సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందమే అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ని ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఏఆర్ రెహమామాన్ తెలిపాడు.
ఓ ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరుని దుబాయ్‌లోని నా కొత్త స్టూడియోలో చేశాను. ఈ మూవీలోని కొన్ని సన్నివేశాల కోసం మణిరత్నాన్ని దుబాయ్‌కి ఆహ్వానించాను. ప్రస్తుతం ఆయన మనసంతా ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి అనుకున్న సమయాన్ని విడుదల చేయడం మీదే ఉంది’ అని చెప్పుకొచ్చాడు. పోస్ట్ ప్రొడ్రక్షన్ జోరుగా సాగుతున్న ఈ సినిమా కొన్ని సన్నివేశాల కోసం రీ షూట్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. జయరామ్, ప్రభు, ప్రకాష్ రాజ్, ఐశ్వర్య లక్ష్మి సహాయ పాత్రలు పోషిస్తున్నారు.