Leharaayi: తొలి తీపి నీ పలుకు.. తొలి తార నీ నవ్వు

ABN , First Publish Date - 2022-09-28T04:57:59+05:30 IST

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్‌ఎల్‌ఎస్ మూవీస్ బ్యానర్‌పై రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా.. ‘ధ‌ర్మ‌పురి’ ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ నటీనటులుగా

Leharaayi: తొలి తీపి నీ పలుకు.. తొలి తార నీ నవ్వు

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్‌ఎల్‌ఎస్ మూవీస్ బ్యానర్‌పై రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా.. ‘ధ‌ర్మ‌పురి’ ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ నటీనటులుగా రామకృష్ణ పరమహంసని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం ‘లెహరాయి’. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, సాంగ్స్‌.. ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ఇదొక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనేది చిత్ర పాటలు తెలియజేస్తున్నాయి. సంగీత ద‌ర్శకుడు ఘంటాడి కృష్ణ ఈ చిత్రంతో జీకే ఈజ్ బ్యాక్ అన్నట్టు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుద‌లైన గుప్పెడంత సాంగ్ మిలియ‌న్ వ్యూస్ రాబట్టుకోగా.. తాజాగా ఈ చిత్రంలోని ‘అప్సరస అప్సరస’ అంటూ సాంగే మరో పాటను మేకర్స్ విడుదల చేశారు. గేయ రచయిత శ్రీమణి ఈ పాటకు సాహిత్యం అందించగా.. రేవంత్ ఆల‌పించారు.


‘‘అప్సరస అప్సరస నా కంట ఎందుకు పడ్డావే అప్సరస..

అప్సరస అప్సరస నా గుండె చప్పుడు నువ్వేలే అప్సరస..’’ అంటూ మొదలైన ఈ పాటలో

‘‘తీపితో తేల్చి చెప్పా

తొలితీపి నీ పలుకని

తారనే పిలిచి చూపా

తొలి తార నీ నవ్వని’’ వంటి సాహిత్యం మంచి ఫీల్‌ను క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రంలో మొత్తం 7 సాంగ్స్ ఉన్నట్లు, మంచి ఫీల్ వున్న క‌థతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించినట్లు ఇదివరకే ద‌ర్శకుడు రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస తెలిపారు. ఆయన చెప్పినట్లే విడుదలవుతున్న పాటలు ప్రేక్షకులని అలరిస్తున్నాయి. కాగా, త్వరలోనే చిత్ర రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటిస్తామని చిత్రబృందం పేర్కొంది.



Updated Date - 2022-09-28T04:57:59+05:30 IST