సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Anudeep KV: ఆ స్టార్ హీరో ఓకే అంటే.. నా తర్వాతి సినిమా అదే..

ABN, First Publish Date - 2022-08-28T03:00:19+05:30

చెస్ అంటే ఇద్దరు ఆడతారు, కానీ, ముగ్గురితో చెస్ ఆడించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన దర్శకుడు అనుదీప్ కేవీ (Anudeep KV). ‘జాతిరత్నాలు’ (Jathi Ratnalu)కు దర్శకత్వం వహించి తనదైన మార్కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెస్ అంటే ఇద్దరు ఆడతారు కానీ, ముగ్గురితో చెస్ ఆడించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన దర్శకుడు అనుదీప్ కేవీ (Anudeep KV). ‘జాతిరత్నాలు’ (Jathi Ratnalu)కు దర్శకత్వం వహించి తనదైన మార్కు కామెడీతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ కు కథను అందించాడు. ఈ సినిమా కూడా కామెడీ జోనర్‌లోనే తెరకెక్కడం విశేషం. ఈ చిత్రం సెప్టెంబర్ 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అతడు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకున్నాడు. 


విక్టరీ వెంకటేష్ (Venkatesh) కోసం తన వద్ద కథ ఉందని అనుదీప్ చెప్పాడు. హీరోకు త్వరలోనే దానిని వినిపిస్తానని తెలిపాడు. ఒకవేళ వెంకీకీ స్క్రిఫ్ట్ నచ్చితే తన తర్వాతి ప్రాజెక్టుగా ఆ చిత్రమే ఉంటుందని తెలిపాడు. కామెడీతో పాటు బలమైన భావోద్వేగాలు ఈ కథలో ఉన్నాయని వివరించాడు. అనుదీప్ ‘పిట్ట‌గోడ’ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలయింది. అయినప్పటికి, జాతిరత్నాలు వంటి సినిమాతో భారీ హిట్ కొట్టాడు. అనుదీప్ గతంలో తీసిన ఓ షార్ట్ ఫిలిం ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్‌కు విపరీతంగా నచ్చింది. దీంతో నాగీ ఓ కథను వినిపించాలని అనుదీప్‌కు చెప్పాడు. అతడు ‘జాతిరత్నాలు’ కథను వినిపించగా, నాగ్ అశ్విన్‌కు విపరీతంగా నచ్చింది. ఫలితంగా తానే నిర్మాతగా మారి ‘జాతిరత్నాలు’ ను నిర్మించాడు. ఈ సినిమాతో అనుదీప్‌ బంపర్ హిట్ కొట్టాడు. దర్శకుడిగా నిలదొక్కకున్నాడు. ఇక అనుదీప్‌ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘ప్రిన్స్’ (Prince) కు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో శివ కార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా నటిస్తున్నాడు. దీపావళి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 



Updated Date - 2022-08-28T03:00:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!