సాహసంతో కూడిన యాక్షన్‌ థ్రిల్లర్‌‌ పాత్రలో ఆండ్రియా

ABN , First Publish Date - 2022-04-03T01:51:09+05:30 IST

హాలీవుడ్‌ హీరోయిన్ల బాటలో కోలీవుడ్‌ నటి ఆండ్రియా జెరెమియా తన సినీ కెరీర్‌ కొనసాగిస్తోంది. తన తొలి చిత్రమైన ‘ఆయిరత్తిల్‌ ఒరువన్‌’లో యాక్షన్‌ క్యారెక్టర్‌లో కనిపించిన ఆండ్రియ... ‘విశ్వరూపం’ చిత్రంలో ఇండియన్‌ రా వింగ్‌ ఆఫీసర్‌గా

సాహసంతో కూడిన యాక్షన్‌ థ్రిల్లర్‌‌ పాత్రలో ఆండ్రియా

హాలీవుడ్‌ హీరోయిన్ల బాటలో కోలీవుడ్‌ నటి ఆండ్రియా జెరెమియా తన సినీ కెరీర్‌ కొనసాగిస్తోంది. తన తొలి చిత్రమైన ‘ఆయిరత్తిల్‌ ఒరువన్‌’లో యాక్షన్‌ క్యారెక్టర్‌లో కనిపించిన ఆండ్రియ... ‘విశ్వరూపం’ చిత్రంలో ఇండియన్‌ రా వింగ్‌ ఆఫీసర్‌గా నటించింది. ‘తుప్పరివాలన్‌’ చిత్రంలో లేడీ గ్యాంగ్‌స్టర్‌ పాత్ర పోషించిన ఆమె ఇపుడు ‘కో’, ‘నో ఎంట్రీ’ వంటి చిత్రాల్లో యాక్షన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ‘నో ఎంట్రీ’ చిత్రంలో ఆండ్రియా ఎంతో సాహసంతో కూడిన యాక్షన్‌ థ్రిల్లర్‌ పాత్ర చేస్తోంది. 


దట్టమైన అటవీ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్ళిన ఒక యువజంట అడవిలోని కొండ శిఖరంలో ఉన్న లగ్జరీ విల్లాలో బస చేస్తుంది. ఆ ఇంటిని క్రూరమైన అడవి కుక్కలు చుట్టుముడతాయి. ఆ కుక్కల నుంచి యువ జంట ఏ విధంగా తప్పించుకున్నారన్నదే ఈ చిత్ర కథ. ఎంతో థ్రిల్లింగ్‌గా, రోమాలు నిక్కబొడుచుకునేలా ఇందులోని సన్నివేశాలను తెరకెక్కించినట్టు దర్శకుడు అళగు కార్తీక్‌ వెల్లడించారు. జంబో సినిమాస్‌ బ్యానరులో శ్రీధర్‌ నిర్మించారు. చిరపుంజిలో షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. 

Updated Date - 2022-04-03T01:51:09+05:30 IST

Read more