ఆమిర్‌ఖాన్.. మోహన్‌లాల్ కలిసింది.. అందుకేనా?
ABN , First Publish Date - 2022-03-28T01:25:51+05:30 IST
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్, మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ కలిసి దిగిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ ఫొటో వెనకున్న కథేంటి అని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ ఫొటో బయటికొచ్చాక వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కబోతుందని చెవులు కొరుక్కుంటున్నారు.

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్, మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ కలిసి దిగిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ ఫొటో వెనకున్న కథేంటి అని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ ఫొటో బయటికొచ్చాక వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కబోతుందని చెవులు కొరుక్కుంటున్నారు. ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేవి తెలియాల్సి ఉంది. అయితే ‘ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు లెజెండ్స్’ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ‘ఫొటో అదిరింది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఆమిర్‌ఖాన్ నటించిన ‘లాల్‌సింగ్ చద్థా’ ఆగస్టు 11న విడుదలకానుంది. ఇందులో టాలీవుడ్ హీరో నాగచైతన్య ఓ పాత్ర పోషించారు. మోహన్‌లాల్ మలయాళ చిత్రాలతో బిజీగా ఉన్నారు.